NTV Telugu Site icon

Chatrapathi: ప్రభాస్ ని గుర్తు చేసిన బెల్లంకొండ హీరో… నార్త్ లో హిట్ పడినట్లే

Chatrapathi

Chatrapathi

ప్రభాస్ ని పర్ఫెక్ట్ మాస్ కటౌట్ గా చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 2005లో వచ్చిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు వీవీ వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని తెలుగులో లాంచ్ చేసిన వినాయక్, హిందీలో కూడా లాంచ్ చేస్తూ ‘ఛత్రపతి’ అనే టైటిల్ తోనే ఈ రిమేక్ ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ ఎప్పటినుంచో జరుపుకుంటున్న ఈ మూవీతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నార్త్ లో సాలిడ్ డెబ్యు ఇస్తాడని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.

Read Also: NTR 30: ఎన్టీఆర్ తో మొదలయ్యింది… ఎన్టీఆర్ తోనే ముగుస్తుందా?

మే 12న ఛత్రపతి సినిమాని రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సంధర్భంగా వదిలిన పోస్టర్ ఇంప్రెస్ చేసింది. నార్మల్ గా సాలిడ్ ఫిజిక్ తో ఉండే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాక్ ని మాత్రమే చూపిస్తూ డిజైన్ చేసిన ఛత్రపతి పోస్టర్ ఆకట్టుకుంది. ఛత్రపతి-కాట్రాజ్ కి మధ్య సముద్రం బ్యాక్ డ్రాప్ లో జరిగే ఫైట్ సీన్ నుంచి ఈ పోస్టర్ ని క్రియేట్ చేశారు. సాయి శ్రీనివాస్ తన ఫిజిక్ తో ప్రభాస్ ని గుర్తు చేసేలా ఉన్నాడు. మాస్ సినిమాలని సూపర్బ్ గా డైరెక్ట్ చెయ్యగల వినాయక్, సాలిడ్ కంటెంట్, హ్యుజ్ యాక్షన్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్… ఇలా అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఛత్రపతి సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో సాలిడ్ హిట్ కొట్టడం గ్యారెంటీలానే కనిపిస్తుంది.