Site icon NTV Telugu

Akhanda: 506 థియేటర్స్ లో అఖండ… నార్త్ ఆడియన్స్ ఫిదా

Akhanda

Akhanda

టికెట్ రేట్స్ తక్కువ ఉన్న సమయంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తమ సినిమాలని రిలీజ్ చెయ్యడానికి భయపడుతూ ఉంటే, సినిమా బాగుంటే ఆడియన్స్ వస్తారు. అయినా టికెట్ రేట్స్ కి మేము భయపడేది ఏంటి? మమ్మల్ని చూడడానికి ఆడియన్స్ రిపీట్ మోడ్ లో వస్తారు అనే నమ్మకంతో అఖండ సినిమాని రిలీజ్ చేశారు బోయపాటి శ్రీను, బాలకృష్ణలు. ఈ ఇద్దరు కలిసి సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడంతో ఆడియన్స్ లో ఈ హిట్ పెయిర్ పై నమ్మకం పెరిగింది. ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొనే అఖండ సినిమాని టికెట్ రేట్స్ తక్కువ ఉన్నా రిలీజ్ చేశారు. బాలయ్య 100 కోట్లు కలెక్ట్ చేస్తాడని, ఓవర్సీస్ లో కూడా జై బాలయ్య అనే నినాదం వినిపిస్తుందని, తమన్ ఆ రేంజు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తాడని ఊహించని ప్రతి ఒక్కరికీ షాక్ ఇచ్చిన అఖండ మూవీ. ఈ సినిమాని చూడడానికి ఆడియన్స్ రిపీట్ మోడ్ లో థియేటర్ కి వెళ్లారు, అందుకే టికెట్ రేట్స్ తక్కువ ఉన్న సమయంలో కూడా ఈ మూవీ ఆ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టగలిగింది. అఖండ సినిమాలో బాలయ్య నటవిశ్వరూపాన్నే చూపించాడు, ముఖ్యంగా అఘోరా గెటప్ లో బాలయ్య అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. బాలయ్య తప్ప ఎవరూ చెయ్యలేరు అని ప్రతి ఒక్కరితో అనిపించుకున్న ఈ మూవీ, క్లైమాక్స్ లో ఆడియన్స్ లో గూస్ బంప్స్ ఇచ్చింది.

అఖండ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ మూవీని హిందీ రిలీజ్ చేస్తే మంచి రీచ్ వచ్చేది అన్నారు. ఆ మాటని కాస్త నిజం చేస్తూ, ప్రస్తుతం నార్త్ లో ఉన్న సినిమా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకోని అఖండ సినిమాని పెన్ స్టూడియోస్ హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. దాదాపు 506 థియేటర్స్ లో అఖండ సినిమా జనవరి 20న ఆడియన్స్ ముందుకి వచ్చింది. బాలయ్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిందీ రిలీజ్. ఇప్పటికే కొంతమంది నార్త్ వాళ్లకి అఖండ సినిమా క్లైమాక్స్ గురించి తెలుసు కాబట్టి హిందీలో చూడడానికి థియేటర్స్ కి వెళ్లారు. మొదటి రోజు అఖండ మూవీ 50 లక్షల వరకూ రాబట్టే ఛాన్స్ ఉంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేసిన ఒక సినిమా 50 లక్షలు వసూళ్లు రాబట్టడం పెద్ద విషయమే. మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే వారం తిరిగే లోపు బాలయ్య నార్త్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టినట్లే.

Exit mobile version