Site icon NTV Telugu

RGV: ఆర్జీవీ వ్యూహం మూవీ పోస్టర్ల దగ్ధం.. డెన్ ఎదుట ఉద్రిక్తత

Rgv

Rgv

Hightension at RGV Den in Hyderabad: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన వర్మ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను టాగ్ చేస్తూ మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇప్పటికే వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మొన్ననే ఘనంగా జరిగింది. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఈరోజు మాత్రం హైదరాబాద్‌లోని ఆర్జీవీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

Anchor Suma: సుమ క‌న‌కాల చొర‌వ‌తో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కి నాట్స్ 5 ల‌క్ష‌ల విరాళం

రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేసి అక్కడే వర్మ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేసి వ్యూహం మూవీ పోస్టర్లను సైతం తగలబెట్టారు ఆందోళనకారులు.వ్యూహం సినిమాలో పాత్రలను వర్మ చూపించిన తీరును నిరసిస్తూ, ఆ మూవీ రిలీజ్ చేయొద్దని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ జోలికి రావద్దని హెచ్చరించారు. ఈ హడావుడి నేపథ్యంలో పోలీసులకు వర్మ ఫిర్యాదు చేయగా పోలీసులు రాగానే టీడీపీ కార్యకర్తలు పారిపోయారని ఆర్జీవీ ట్వీట్లో పేర్కొన్నారు.

Exit mobile version