Site icon NTV Telugu

Kamal Haasan: ఓటీటీలో ‘విక్రమ్’కు హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్!

Vikram Ott Weekend

Vikram Ott Weekend

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలించింది. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో తిరిగి తన స్టార్ డమ్ ను ప్రూవ్ చేసుకున్నారు కమల్ హాసన్. ఈ నెల 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సినిమా దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ సాధించి, ఓటీటీలో రికార్డ్ హిట్ అందుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు కన్నడ, మలయాళ ఆప్షన్స్ ఇచ్చింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ఈ ఐదు భాషల్లోనూ రికార్డ్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంటోంది ‘విక్రమ్’.

ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, ”మా ‘విక్రమ్’ చిత్రాన్ని ప్రేక్షకులు అందించిన అపూర్వ విజయాన్ని కట్టబెట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ద్వారా ప్రతి ఇంటికీ ఈ సినిమా చేరుకుంది. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ సాధించడం ఆనందంగా ఉంది. మా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్” అని అన్నారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ, ”మా ఓటీటీలో ‘విక్రమ్’ సాధిస్తున్న రికార్డ్ నెంబర్స్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు తెరకెక్కించిన తీరు క్లాసిక్ మూవీ అనే పేరు తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ‘విక్రమ్’ వ్యూయర్ షిప్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీక్ ను అందించింది. ఇంత గొప్ప సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం ఆనందంగా ఉంది” అని అన్నారు.

Exit mobile version