NTV Telugu Site icon

Highest Grossing Telugu Movies 2023: 2023లో అత్యధికంగా వసూళ్లు సంపాదించిన సినిమాల్లో బాలయ్య,, తేజ్ లదే హవా!

Balakrishna Sai Dharam Tej

Balakrishna Sai Dharam Tej

Highest Collected Telugu Movies in 2023: 2023 చివరికి వచ్చేశాం, ఈ క్రమంలో ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించిన కొన్ని తెలుగు సినిమాలలో టాప్ టెన్ ఏమిటో చూద్దాం పదండి.
1. ఆది పురుష్: రామాయణ కథను ఆధారంగా చేసుకుని ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయి నెగటివ్ రెస్పాన్స్ అందుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ ఏడాది ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన టాప్ 1 తెలుగు సినిమా గా నిలిచింది.
2. వాల్తేరు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతికి 2023 మొదట్లోనే విడుదల అయిన ఈ సినిమాలో రవితేజ కూడా కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండవ సినిమాగా నిలిచింది.
3. వీర సింహా రెడ్డి : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీర సింహా రెడ్డి సినిమా కూడా వాల్తేరు వీరయ్య సినిమాకి పోటీగా సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా అఖండ తర్వాత మరొక సూపర్ హిట్ గా బాలయ్య కెరీర్ లో నిలవడమే కాదు తెలుగులో టాప్ 3 సినిమాల లిస్టులో నిలిచింది.
4. సార్ : ధనుష్ హీరోగా వెంకటే అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చాయి. దీంతో సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టి టాప్ గ్రాసింగ్ మూవీస్ లో నాలుగవ స్థానంలో నిలిచింది.
5. దసరా : న్యాచురల్ స్టార్ నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన దసరా సినిమాలో మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టి టాప్ గ్రాసింగ్ మూవీస్ లో ఐదవ స్థానంలో నిలిచింది.

Cyber Fraud: ఓ మహిళకు పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేసి.. రూ. 3.37 ల‌క్షలు కొట్టేసిన స్కామ‌ర్లు

6. బ్రో : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించగా సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ రీమేక్ సినిమా కూడా కొంత డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం గట్టిగానే తెచ్చుకుంది. అలా ఈ సినిమా టాప్ 6 గ్రాసర్ మూవీగా నిలిచింది.
7. భగవంత్ కేసరి: 2023 లో బాలయ్య హీరోగా విడుదల అయిన రెండో సినిమా భగవంత్ కేసరి కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు శ్రీ లీల నటించగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కూడా హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఏడవ స్థానంలో నిలిచింది.
8. విరూపాక్ష :ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా విరూపాక్ష. తేజ్ కి చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ కావడంతో పాటు కలెక్షన్స్ వర్షం కురిసింది. అలా ఈ సినిమా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాల్లో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.
9. బేబీ : ఆనంద్ దేవరకొండ -వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన బేబీ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా మంచి హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగా నమోదవగా ఈ సినిమా టాప్ గ్రాసింగ్ సినిమాల్లో 9వ స్థానంలో నిలిచింది.
10. ఖుషి: విజయ్ దేవరకొండ- సమంత హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమా కూడా మంచి హిట్ టాక్ అందుకుంది. ఇక ఈ సినిమా టాప్ గ్రాసింగ్ సినిమాల్లో పదో స్థానంలో ఉంది.

Show comments