The Ghost : ఎడారిలో యాక్షన్.. నాగార్జున స్టంట్స్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున అక్కినేని ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, దుబాయ్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా సినిమా సెట్స్ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ షేర్ చేస్తూ “ది ఘోస్ట్” సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇటీవల దర్శకుడు దుబాయ్ లోని ఓ ఎడారి ప్రాంతంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న స్టంట్స్ కి సంబంధించి కొన్ని BTS చిత్రాలను రిలీజ్ చేశారు.
Read Also : RRR : టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Also Read
ఇందులో నాగ్ రైడర్ దుస్తులలో ధరించి యాక్షన్ సీక్వెన్స్‌కు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. నాగ్ ఈ చిత్రంలో పూర్తి యాక్షన్ హీరోగా కన్పించి తన అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు అన్పిస్తోంది. నాగార్జున హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా “ది ఘోస్ట్”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..