Site icon NTV Telugu

Hi Nanna: సెకండ్ డే జోష్ పెరిగింది మరి కలెక్షన్స్ సంగతేంటి?

Hi Nanna

Hi Nanna

న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ మొదటిసారి జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ తో నాని-మృణాల్-బేబీ కియారా హాయ్ నాన్న సినిమాని నిలబెట్టారు. దాదాపు 30 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో రిలీజ్ అయిన హాయ్ నాన్న సినిమా టాక్ బాగున్నా కలెక్షన్స్ మాత్రమే వీక్ గా ఉన్నాయి. మొదటి రోజు దాదాపు 7 కోట్ల వరకు కలెక్ట్ చేసిన హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర కాస్త వీక్ గా కనిపించింది. ట్రేడ్ వర్గాల అంచనాలని తలకిందులు చేస్తూ డే 2 డే 1 కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది హాయ్ నాన్న సినిమా. రెండో రోజు నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా రిలీజ్ ఉన్నా కూడా హాయ్ నాన్న బుకింగ్స్ పెరిగాయి అంటే మౌత్ టాక్ బాగానే కలిసొచ్చింది.

ఇక  మూడో రోజు కూడా హాయ్ నాన్న బుకింగ్స్ రాక్ సాలిడ్ గా ఉన్నాయి. మొదటి రెండు రోజుల కన్నా మూడో రోజు హాయ్ నాన్న బుకింగ్స్ పెరిగాయి, రేపు సండే కాబట్టి హాయ్ నాన్న మంచి ఫిగర్ ని నమోదు చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల కన్నా ఓవర్సీస్ లో హాయ్ నాన్న ఎక్కువ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఓవర్సీస్ లో నాని సినిమా ఎప్పుడూ మంచి కలెక్షన్స్ ని రాబడుతాయి… ఇప్పుడు కూడా హాయ్ నాన్న సినిమా వన్ మిలియన్ చేరువలో ఉంది. సండే కంప్లీట్ అయ్యే సరికి హాయ్ నాన్న 1 మిలియన్ క్రాస్ చేసి 1.5 మిలియన్ వైపు ట్రావెల్ అవుతుంది. టెస్టింగ్ పీరియడ్ అయిన మండే రోజున హాయ్ నాన్న సినిమా ఎలా నిలబడుతుంది అనే దాన్ని బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని చేరుకుంటుందా లేదా అనేది ఉంటుంది.

Exit mobile version