Site icon NTV Telugu

నాగార్జున “ఘోస్ట్”గా మారేది ఎవరు ?

Ghost

టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం “ఘోస్ట్”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

Read Also : “ఆచార్య” పోస్ట్ పోన్… అసలు కారణం ఇదే !

“ఘోస్ట్”లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కన్పించట్లేదు. గత కొన్ని రోజులుగా కాజల్ తల్లి కాబోతోందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయంపై కాజల్ మౌనంగా ఉంది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ను రీప్లేస్ చేస్తారంటూ మరో వార్త బయల్దేరింది. అంతేకాదు కాజల్ కూడా “ద ఘోస్ట్” చిత్ర నిర్మాతలకు వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగడం లేదని తెలియజేసిందని సమాచారం. ఈ కారణంగా మేకర్స్ ఇప్పుడు ఆమె స్థానంలో ఇతర హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కాజల్ అగర్వాల్ స్థానంలో త్రిష, ఇలియానా పేర్లను గమనిస్తున్నారు. నాగార్జున ఇప్పటికే త్రిషతో “కింగ్” లో నటించారు. ఇలియానా నాగార్జునతో ఏ సినిమా చేయలేదు. కానీ మేకర్స్ బాలీవుడ్ బ్యూటీల వైపు కూడా చూస్తున్నారట. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.

Exit mobile version