నాగార్జున “ఘోస్ట్”గా మారేది ఎవరు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం “ఘోస్ట్”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
Read Also : “ఆచార్య” పోస్ట్ పోన్… అసలు కారణం ఇదే !
Also Read
- Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
- Peddi : "పెద్ది"పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ... ప్రశంసల వర్షం
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
“ఘోస్ట్”లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కన్పించట్లేదు. గత కొన్ని రోజులుగా కాజల్ తల్లి కాబోతోందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయంపై కాజల్ మౌనంగా ఉంది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ను రీప్లేస్ చేస్తారంటూ మరో వార్త బయల్దేరింది. అంతేకాదు కాజల్ కూడా “ద ఘోస్ట్” చిత్ర నిర్మాతలకు వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగడం లేదని తెలియజేసిందని సమాచారం. ఈ కారణంగా మేకర్స్ ఇప్పుడు ఆమె స్థానంలో ఇతర హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కాజల్ అగర్వాల్ స్థానంలో త్రిష, ఇలియానా పేర్లను గమనిస్తున్నారు. నాగార్జున ఇప్పటికే త్రిషతో “కింగ్” లో నటించారు. ఇలియానా నాగార్జునతో ఏ సినిమా చేయలేదు. కానీ మేకర్స్ బాలీవుడ్ బ్యూటీల వైపు కూడా చూస్తున్నారట. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!