టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా వేదికగా అభిమానులకు తెలియజేసింది. ” అన్ని జాగ్రత్తలు తీసుకున్నపటికీ అన్ని లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నాను. దయచేసి ఇటీవల కాలంలో నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా చెప్తున్నాను దయచేసి అందరు మాస్కులు ధరించండి.. అవసరమైతే తప్ప బయటికి రాకండి.. జాగ్రత్తగా ఉండండి” అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రియాంక, రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా విజయంతో అమ్మడు మంచి అవకాశాలనే అందుకుంది. ‘తిమ్మరుసు’, ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ లాంటి చిత్రాలతో దగ్గరైంది. ఇక తాజాగా ప్రియాంక మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇక ప్రియాంక కరోనా బారిన పడిందని తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
విజయ్ దేవరకొండ హీరోయిన్ కి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

priyanka