Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namitha: సొంతం, జెమిని సినిమాలతో పాపులర్ హీరోయిన్గా మారి తెలుగు ప్రేక్షకులు దగ్గరైన ముద్దుగుమ్మ నమిత. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహా’ సినిమాలోని సింహమంటి చిన్నోడే.. వేటకొచ్చాడే అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో నమిత హాట్‌గా కనిపించి కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. తాజా నమిత తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకుంది. చెన్నై సమీపంలోని క్రోమ్‌పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో పండంటి ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్టు వెల్లడించింది. ఈ మేరకు భర్తతో కలిసి కవలలను ఎత్తుకున్న ఫోటోలను షేర్ చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని నమిత మురిసిపోయింది. శిశువులు, తాను ఆరోగ్యంగా ఉన్నామని.. అభిమానుల ఆశీర్వాదాలు, ప్రేమ ఎల్లప్పుడూ తనపై ఉండాలని నమిత ఆకాంక్షించింది.
అంతేకాకుండా తాను పిల్లలను కన్న ఆస్పత్రి సిబ్బందికి నమిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తన ప్రెగ్నెన్సీ జర్నీలో తనను గైడ్ చేసినందుకు, తన పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు వైద్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపింది. కాగా 2017 నవంబరులో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని హీరోయిన్ నమిత వివాహం చేసుకుంది. తిరుపతిలోని ఇస్కాన్ లోటస్ టెంపుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీవీ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అంతగా కనిపించకపోయినా నమితకు ప్రేక్షకుల్లో మాత్రం ఆదరణ తగ్గలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నమిత కవల పిల్లల ఫోటోలు వైరల్‌గా మారాయి. తెలుగులో వెంకటేష్‌తో జెమిని, రవితేజతో ఒకరాజు-ఒకరాణి, ప్రభాస్‌తో బిల్లా, బాలయ్యతో సింహా వంటి సినిమాల్లో నమిత నటించింది. అయితే తెలుగులో కంటే తమిళంలోనే నమిత ఎక్కువగా నటించింది. తమిళనాడు అభిమానులు ఆమెకు గుడి కూడా కట్టించారు.
Also Read
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
తాజావార్తలు
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!