Site icon NTV Telugu

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్.. వీడియో వైరల్

Namitha

Namitha

Namitha: సొంతం, జెమిని సినిమాలతో పాపులర్ హీరోయిన్‌గా మారి తెలుగు ప్రేక్షకులు దగ్గరైన ముద్దుగుమ్మ నమిత. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహా’ సినిమాలోని సింహమంటి చిన్నోడే.. వేటకొచ్చాడే అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో నమిత హాట్‌గా కనిపించి కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. తాజా నమిత తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకుంది. చెన్నై సమీపంలోని క్రోమ్‌పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో పండంటి ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్టు వెల్లడించింది. ఈ మేరకు భర్తతో కలిసి కవలలను ఎత్తుకున్న ఫోటోలను షేర్ చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని నమిత మురిసిపోయింది. శిశువులు, తాను ఆరోగ్యంగా ఉన్నామని.. అభిమానుల ఆశీర్వాదాలు, ప్రేమ ఎల్లప్పుడూ తనపై ఉండాలని నమిత ఆకాంక్షించింది.

అంతేకాకుండా తాను పిల్లలను కన్న ఆస్పత్రి సిబ్బందికి నమిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తన ప్రెగ్నెన్సీ జర్నీలో తనను గైడ్‌ చేసినందుకు, తన పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు వైద్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపింది. కాగా 2017 నవంబరులో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని హీరోయిన్ నమిత వివాహం చేసుకుంది. తిరుపతిలోని ఇస్కాన్ లోటస్ టెంపుల్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీవీ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అంతగా కనిపించకపోయినా నమితకు ప్రేక్షకుల్లో మాత్రం ఆదరణ తగ్గలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నమిత కవల పిల్లల ఫోటోలు వైరల్‌గా మారాయి. తెలుగులో వెంకటేష్‌తో జెమిని, రవితేజతో ఒకరాజు-ఒకరాణి, ప్రభాస్‌తో బిల్లా, బాలయ్యతో సింహా వంటి సినిమాల్లో నమిత నటించింది. అయితే తెలుగులో కంటే తమిళంలోనే నమిత ఎక్కువగా నటించింది. తమిళనాడు అభిమానులు ఆమెకు గుడి కూడా కట్టించారు.

Exit mobile version