Site icon NTV Telugu

Mrunal: మృణాల్ మత్తులో సోషల్ మీడియా!

Mrunal

Mrunal

ప్రస్తుతం సోషల్ మీడియా అంతా మృణాల్ ఠాకూర్ మత్తులో పడిపోయింది. అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సీతారామం సినిమాలో సీతగా కట్టిపడేసిన మృణాల్… ఆ తర్వాత నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమాతో మరోసారి మాయ చేసింది. త్వరలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సీతారామంతో హిట్ వచ్చిందని తొందరపడకుండా చాలా కూల్‌గా మంచి కథలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది మృణాల్. అయితే సినిమాల్లో అచ్చ తెలుగమ్మాయిలా ట్రెడిషనల్‌గా కనిపించే మృణాల్… అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మంట పుట్టిస్తు ఉంటుంది. తన అందంతో కుర్రాళ్ళకు కిర్రెక్కిస్తుంది. లేటెస్ట్‌గా మృణాల్ గ్లామర్ షోకు సోషల్ మీడియాకే చెమటలు పడుతున్నట్టుగా ఉంది.

Read Also: Ajith Kumar: అక్కడ విడ ముయార్చి షూటింగ్ కంప్లీట్ అయ్యింది…

ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో మృణాల్‌ను చూస్తే వావ్ అనాల్సిందే. ఈ వేడుకకు ఆలియా భట్, జాన్వీ కపూర్‌తో పాటు చాలామంది స్టార్ హీరోయిన్లు హాజరయ్యారు కానీ అందరికంటే మిన్నగా తన భారీ అందంతో మృణాల్ అందరినీ అట్రాక్ట్ చేసింది. అసలు ఈమె మా సీతనేనా? అనేలా హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. మృణాల్ స్మైల్‌కు, ఆ టెంప్టింగ్ లుక్‌కు తెగ అట్రాక్ట్ అయిపోయారు కుర్రాళ్లు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అది ఇది అని కాకుండా… సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నింటిలోను అమ్మడి ఫోటోలే కనిపిస్తున్నాయి. దీంతో మృణాల్ ట్యాగ్, మృణాల్ ఫోటోలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.

Read Also: Hrithik Roshan: మీరు అనుకున్న దానికన్నా ముందే వార్ 2… హ్రితిక్ సూపర్ హింట్ ఇచ్చాడు

Exit mobile version