NTV Telugu Site icon

Mandakini: బిడ్డకు పాలు పట్టడం కూడా కామమే.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Mandakini

Mandakini

Mandakini: చిత్ర పరిశ్రమలో రరోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఉన్న మాదిరి ఇప్పుడు లేదు సినీ ఇండస్ట్రీ. ఇక అప్పుడున్న ప్రేక్షకులు కూడా ఇప్పుడు లేరు. ఇప్పుడందరూ కంటెంట్ బావుంటే.. సినిమాకు తగ్గట్టు శృంగారాన్ని కూడా ఓకే అంటున్నారు. మరి ముఖ్యంగా హీరోయిన్లు క్లివేజ్ షో చేసినా, అందాలను ఆరబోసినా పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ అప్పట్లో కొద్దిగా స్కిన్ షో చేస్తేనే అశ్లీలం అని చెప్పుకొచ్చేవారు. తాజాగా స్టార్ హీరోయిన్ మందాకినీ అదే విషయాన్నీ గుర్తుచేశారు. ఒకప్పుడు ఆమె చేసిన సీన్ ఇప్పటికి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కపూర్ నటించిన ‘రామ్ తేరి గంగా మైలీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది మందాకినీ. మొదటి సినిమాలోనే రిస్క్ చేసి క్లివేజ్ షో చూపించింది. అది కూడా ఒక తల్లిగా బిడ్డకు పాలుపట్టే సన్నివేశం. అప్పట్లో అది పెద్ద సంచలనమే సృష్టించింది. ఆలా ఒక మహిళ జాకెట్ తీసి బిడ్డకు పాలు ఇవ్వడం అనేది ఎంతో అశ్లీలత అని చెప్పుకొచ్చేవారు. ఇక ఈ సీన్ పై ఒక ఇంటర్వ్యూలో మందాకినీ మాట్లాడుతూ ” ఇప్పుడు హీరోయిన్లు చేస్తున్న స్కిన్ షో తో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. అది నేను మాతృత్వంతో బాబుకు పాలు పట్టిన సన్నివేశం. దాన్ని డైరెక్టర్ ఒక జిమ్మిక్కు వాడి చిత్రీకరించాడు. నేనేం అశ్లీలతను చూపించలేదు. ఒక వేళ ఇప్పుడు కనుక ఆ సీన్ చూస్తే చాలామంది కామంతో చూస్తారేమో” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments