Site icon NTV Telugu

చీరకట్టులో సత్యసాయి ఆశ్రమానికి వెళ్లిన సాయిపల్లవి

హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ పరంగా ఫుల్లు స్పీడుగా దూసుకెళ్తోంది. పేరుకు మలయాళీ ముద్దుగుమ్మ అయినా తెలుగు సినిమాల్లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలే నాగచైతన్యతో జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది. తద్వారా టాలీవుడ్‌కు మళ్లీ పూర్వపు వైభవాన్ని ఈ మూవీ తెచ్చిపెట్టింది. ఈ మూవీలో సాయిపల్లవి తన డ్యాన్సులతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. ఫిదా తరహాలోనే మరోసారి తెలంగాణ స్లాంగ్‌లో డైలాగులు చెప్పి అలరించింది. సాయిపల్లవి నటించిన లవ్‌స్టోరీ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి.

తాజాగా ఈ అమ్మడు పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా సంప్రదాయమైన చీరకట్టులో సత్యసాయి సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించింది. కాగా సాయిపల్లవి తల్లి పుట్టపర్తి సత్యసాయి భక్తురాలు. అందుకే ఆమెకు సాయి అని వచ్చేలా సాయిపల్లవి అనే పేరును పెట్టినట్లు తెలుస్తోంది. తల్లి తరహాలోనే సాయిపల్లవి కూడా పుట్టపర్తి సత్యసాయి భక్తురాలు. ఈ నేపథ్యంలోనే ఆమె పుట్టపర్తికి వచ్చి సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించింది. మరోవైపు వరుస సినిమాలతో సాయిపల్లవి అభిమానులను అలరించనుంది. రానా విరాటపర్వం సినిమాతో పాటు నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version