Site icon NTV Telugu

Vishal : విశాల్ పెళ్లి ఆలస్యానికి ఇంత పెద్ద కారణం ఉందా..?

Vishal

Vishal

Vishal : తమిళ హీరో విశాల్ కు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చాలా కాలంగా సినిమాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. తరచూ విశాల్ పెళ్లి గురించి ఏదో ఒక రూమర్ వినిపించేది. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆయనకు పలానా హీరోయిన్ తో పెళ్లి అంటూ ఎన్నో రూమర్లు వచ్చేవి. చివరకు హీరోయిన్ సాయి ధన్సికతో తన మ్యారేజ్ ను స్వయంగా ప్రకటించాడు విశాల్. అయితే విశాల్ పెళ్లి ఇంత ఆలస్యం కావడానికి కారణాలను ఇక్కడ చాలా చర్చించుకోవాలి. వాస్తవానికి సాయి ధన్సికతో విశాల్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నాడు. కానీ రీసెంట్ గానే ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు.

Read Also : Covid-19: తొమ్మిది నెలల శిశుకుకు కోవిడ్-19 పాజిటివ్..

అయితే వీరిద్దరూ 15 ఏళ్లుగా ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఐదేళ్లకు పైగా ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇన్నేళ్లు వీరిద్దరూ పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే దానికి ఓ పెద్ద కారణమే ఉంది. అదే నడిగర్ సంఘం. తమిళ ఇండస్ట్రీలో నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కొత్త సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్.. ఈ సంఘం బిల్డింగ్ కట్టిన తర్వాత మొదటి పెళ్లి అందులో తానే చేసుకుంటానని గతంలోనే ప్రకటించాడు.

ఆ బిల్డింగ్ కట్టేందుకు చాలా ప్రతిపాదనలు వచ్చినా అనేక కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చింది. కానీ విశాల్ మాత్రం పట్టు వదల్లేదు. ఆ బిల్డింగ్ కోసం అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ భవనం పూర్తి అయింది. చెన్నై నడిమధ్యన టి.నగర్, హబీబుల్లా రోడ్‌లో ఈ బిల్డింగ్ ను నిర్మించారు. అవార్డు ఫంక్షన్ల కోసం 1000 సీట్ల ఆడిటోరియం, 800 సీట్ల మ్యారేజ్ హాల్ ను కట్టారు. బిల్డింగ్ పూర్తి అయింది కాబట్టి ఇప్పుడు విశాల్ మ్యారేజ్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మ్యారేజ్ హాల్ లోనే విశాల్ పెళ్లి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : Gautam Gambhir: 2027 వరల్డ్ కప్ వరకు కష్టమే.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన గంభీర్..!

Exit mobile version