Vishal: నేను ఇష్టపడిన వారంతా దూరం అవుతున్నారు… హీరో ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Vishal Emotional about Bhavatarini Death: తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుమార్తె 47 ఏళ్ల భావతరిణి క్యాన్సర్ తో పోరాడుతూ శ్రీలంకలో కన్నుమూయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె మరణంతో ఇళయరాజా తీవ్ర విషాదంలో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమ అంతా ఆ కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అండగా ఉంటామని సోషల్ మీడియా వేదికగా, మీడియా వేదికగా చెబుతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఇళయరాజా కూతురు భావతరిణి మృతి పై హీరో విశాల్ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆయన తాను ఎమోషనల్ అవుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.
Ayalaan: శివ కార్తీకేయన్ అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా.. అసలు ఏమైందంటే?
Also Read
- PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
- Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
- Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్‌లో సూర్య..
తాజాగా విశాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. నువ్వు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళతావు అనుకోలేదని ఆయన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. నా సొంత సోదరిగా భావించే నిన్ను ఇప్పుడు నేను చాలా మిస్ అవుతున్నాను అని విశాల్ పేర్కొన్నారు. అంతేకాదు కొన్ని వారాలుగా నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో తనకు తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తున్నాయని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. గత కొన్నాళ్లుగా భావతరిణి క్యాన్సర్ తో పోరాడుతుంది. శ్రీలంకలో ఆమె చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది అని తెలిసిన వెంటనే సుమారు రెండు రోజుల క్రితం ఇళయరాజా అన్ని పనులు ఆపేసి శ్రీలంక బయలుదేరి వెళ్లారు. తన కుమార్తెతో చివరి క్షణాల్లో కూడా ఆయన పక్కనే ఉన్నట్లుగా తెలుస్తోంది.
Dear Bavatha. I write this with a heavy heart and unable to digest it. Am really sorry you are not going to be with us anymore and left us to be with the gods. I miss u as a sister, as my own, more than I knew you as Ilayaraja sir’s daughter or Yuvan’s sister or Vasuki’s cousin.…
— Vishal (@VishalKOfficial) January 26, 2024
తాజావార్తలు
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!