Srikanth: ‘వెంకట లక్ష్మితో, యాడాది కిందట ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkata Lakshmi Tho Yadadi Kindhata Title Poster Launched: కొత్త వాళ్ళను, చిన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆలేటి రాజేష్ నిర్మాతగా రామమూర్తి కొట్టాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం ‘వెంకటలక్ష్మితో’. ‘యాడాది కిందట’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో రఘు గద్వాల్ హీరోగా, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోయిన్స్‌గా నటించగా తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ లాంచ్ చేసి సినిమా విజయం సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘టైటిల్ చాలా బాగుంది. క్యాచీగా ఉంది. యంగ్ టీమ్ చేసిన సినిమా ఇది, షార్ట్ ఫిలింస్ తో ఫేమస్ అయిన హీరో రఘు ఈ సినిమా ద్వారా అందర్నీ ఆకట్టుకుంటాడని నమ్ముతున్నా. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు, ఇది కూడా ఓ కొత్త కంటెంట్‌తో రాబోతోందని అర్ధమవుతోందని అన్నారు. హీరో రఘు గద్వాల మాట్లాడుతూ.. ‘నూతన నటీనటులతో ఏడాది కిందట ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం, ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ గారు మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దర్శకుడు రామమూర్తి కొట్టాల మాట్లాడుతూ ఇదొక స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం. థ్రిల్లర్, సస్పెన్స్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. అంతా కొత్త వారితో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీల్‌ని ఇస్తుందని అన్నారు.
Also Read
- Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
- Donga Naa Koduku: జాగ్రత్త.. 'దొంగ నా కొడుకు' వస్తున్నాడు! ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చూశారా..
- Nani - Nithiin: 20 ఏళ్లలో ఎంత మార్పు.. ఒకప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు అదే హీరోకు నిర్మాతగా!
- SS Rajamouli: 'బాహుబలి', 'RRR' కాదు.. రాజమౌళి బెస్ట్ మూవీ ఇదేనట!
తాజావార్తలు
-
Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
-
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
ట్రెండింగ్
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..