Site icon NTV Telugu

Sharwanand: ‘నా’ ఒక ‘జీవితం’ సినిమాకే అంకితం- శర్వా ఎమోషనల్ లెటర్

Sharwanand

Sharwanand

యంగ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి నటుడు అనే క్రెడిబిలిటీ ఉంది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో శర్వా దిట్ట. ప్రస్థానం లాంటి సినిమాలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన శర్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అయ్యింది. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో తనకి అండగా నిలిచిన అభిమానులకి థాంక్స్ చెప్తూ శర్వానంద్ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశాడు.

Read Also: Manchu Manoj: రాజకీయాల ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న కోరిక వుంది

2004లో వచ్చిన గౌరీ సినిమాలో మొదటిసారి నటించిన శర్వా తన ఇన్నేళ్ల ఫిల్మ్ జర్నీ గురించి రాస్తూ… “20 ఏళ్లుగా ఎన్నో పాత్రలు చేస్తూ, వెండితెరపై అందర్నీ అలరిస్తున్నాను. భావోద్వేగాల తో నిండిన ఈ ప్రయాణం లో 20 సంవత్సరాల స్నేహం, కష్టాలు, ఎత్తులు, లోతులు, చిరునవ్వులు ఎన్నో మరెన్నో. అచంచలమైన ప్రేమ మరియు మద్దతుతో నా ఈ ప్రయాణం లో నాకు అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచాయి. నా ఈ ‘28 ఒక జీవితం’ సినిమా కి అంకితం. 20 సంవత్సరాల క్రితం ‘శ్రీకారం’ చుట్టిన ఈ సినీ ‘ప్రస్థానం’ మరుపురానిది, మరువలేనిది. ఈ సినీ లోకం లో నా ‘గమ్యం’ ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం ప్రతి క్షణం “రన్‌ రాజా రన్‌” లా పరుగులు తీస్తూనే ఉంటాను. కృషి చేస్తూనే ఉంటాను. ‘శతమానం భవతి’ అంటూ మీరు నాకు ఇచ్చే ఆశీస్సులతో ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. మీ శర్వానంద్‌” అంటూ శర్వానంద్ లెటర్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం శర్వానంద్ డైరెక్టర్ శ్రీరామ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లండన్ లో జరుగుతుంది.

Read Also: Abhiram: బాక్సాఫీస్ బరిలో రామానాయుడి మనవడికి గట్టి పోటీ!

Exit mobile version