ఇప్పుడప్పుడే ఈ కరోనా మహమ్మారి పోయేలా కనిపించడం లేదు. చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా కుదేలు చేసిన ఈ మహమ్మారి మరోసారి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్టార్స్ కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ మధ్యనే కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాధికా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ కు పాజిటివ్ రావడంతో వారు ఐసోలేషన్ లో ఉండి ఇటీవలే బయటికి వచ్చారు. ఇక శరత్ కుమార్ సైతం కోలుకొని బయటికి వచ్చిన కొద్దిరోజులకే మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
“ప్రియమైన స్నేహితులు, నా దగ్గరి బంధువులు రాజకీయ పార్టీలోని నా సోదర సోదరీమణులకు తెలియజేస్తున్నాను. ఈ సాయంత్రం నేను పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. నాతో గత వారం రోజులుగా పరిచయం ఉన్న ప్రియమైన వారందరూ వెంటనే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవలసిందిగా సవినయంగా కోరుతున్నాను” అంటూ తెలిపారు.ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.
