Site icon NTV Telugu

Nikhil Siddhartha : హీరో నిఖిల్‌కు పితృ వియోగం..

Nikhil

Nikhil

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ ప్రసాద్ సిద్ధార్థ్ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఈ క్రమంలో శ్యామ్ సుందర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా  పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్యామ్ సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. కాగా శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన నిఖిల్.. సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.

స్టార్ హీరో రేంజ్ ను అందుకునే ఈ సమయంలో ఆయనకు పితృ వియోగం కలగడం అందరిని కలిచివేస్తోంది. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే ‘స్పై’ టైటిల్ తో ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. శ్యామ్ ప్రసాద్‌ సిద్ధార్థ్ మృతితో ఒక్కసారిగా నిఖిల్‌ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version