Site icon NTV Telugu

Naga Shaurya: కుర్రాడు కత్తి.. ఒక్క హిట్ పడితే ఉంటుంది.. మాస్టారూ

Shourya

Shourya

Naga Shaurya: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నాగ శౌర్య. ఈ సినిమా తరువాత విజయాపజయాలను పట్టించుకోకుండా ఒక్కో సినిమా చేస్తూ వస్తున్నాడు. విజయాలు వచ్చాయని పొంగిపోవడం, అపజయాలు వచ్చాయని కృంగిపోవడం నాగ శౌర్య కు చేతకాదు. మంచి సినిమాలను ప్రేక్షకులకు ఇవ్వడానికే ఈ కుర్రహీరో కష్టపడుతూ ఉంటాడు. గత కొన్నేళ్లుగా నాగ శౌర్యకు మంచి సాలిడ్ హిట్ పడలేదనే చెప్పాలి. క్లాస్, మాస్ సినిమాలను ట్రై చేస్తూ వస్తున్నా కూడా అతనికి ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. అశ్వద్ధామ అనే సినిమా కోసం నాగశౌర్య సిక్స్ ప్యాక్ చేసిన విషయం తెల్సిందే. అప్పటినుంచి ఆ బాడీని అలానే మెయింటైన్ చేస్తున్నాడు. ఇక గతేడాది ప్రేమించిన అమమయిని పెళ్లాడిన శౌర్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు శౌర్య చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి.

Pawan Kalyan: కొంచెం ఊపిరి పీల్చుకొనే టైమ్ అన్నా ఇవ్వండన్నా.. చంపేస్తారా

ఇక సినిమాలతో పాటే సోషల్ మీడియాలో కూడా ఈ కుర్ర హీరో యమా యాక్టివ్ గా ఉంటాడు. తన పర్సనల్ లైఫ్ లో మెమొరీబుల్ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా శౌర్య.. ఒక ఫోటోను షేర్ చేశాడు. తన పెట్ డాగ్ బర్త్ డే అని దానికి విష్ చేస్తూ ఒక ఫోటోను షేర్ చేశాడు. ఇక ఆ ఫోటో లో డాగ్ కన్నా అందరి చూపు శౌర్య మీదనే.. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో షర్ట్ బటన్స్ విప్పి సిక్స్ పాక్ చూపిస్తూ.. స్టైల్ గా సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇక ఈ ఫోటో చూసిన వారందరు కుర్రాడు కత్తిలా ఉన్నాడు.. కానీ హిట్ మాత్రం పాడడం లేదు.. ఒక్క హిట్ పడితే.. స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోతాడు అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ హీరోకు ఆ హిట్ ఎప్పుడు అందుతుందో చూడాలి.

Exit mobile version