Site icon NTV Telugu

Shivam Bhaje: ‘శివం భజే’ అంటూ వచ్చేస్తున్న ఓంకార్ తమ్ముడు

Shivam Bhaje

Shivam Bhaje

Hero Ashwin Babu’s new-age film titled ‘Shivam Bhaje’: యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఒక సినిమా తెరకెక్కుతోంది. గాంధర్వ ఫేమ్ అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోకి మొన్నీమధ్యనే బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ అడుగు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి ‘జై చిరంజీవ’ చిత్రం తో టాలీవుడ్ కి పరిచయమయిన ఈ పాపులర్ బాలీవుడ్ నటుడు ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘బిగ్ బ్రదర్’ సినిమాలో కూడా నటించారు. ఈ చిత్రానికి ఒక ఆధ్యాత్మికమైన టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ‘శివం భజే’ అనేది సినిమా పేరుగా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు విడుదలైన అద్భుతమైన టైటిల్ పోస్టర్‌లో శివుని గంభీరమైన చిత్రాన్ని చూపారు. హీరో ఎత్తైన పర్వతాల నేపథ్యంలో శివుని యొక్క భారీ రూపం ముందు నిలబడి చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ”అశ్విన్ హీరోగా ఒక వైవిధ్యమైన కథతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంగా ‘శివం భజే’ తెరకెక్కుతుంది.

Oppenheimer OTT: ఏడు అవార్డులతో సత్తా చాటిన సినిమా వచ్చేది ఈ ఓటీటీలోనే.. గెట్ రెడీ

కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. కామెడీ, డ్రామా, యాక్షన్ థ్రిల్స్ తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, తమిళ విలన్ సాయి ధీనా, హైపర్ ఆది ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకుని భారీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు. దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, ” మా కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ‘శివం భజే’ దొరకడం చాలా సంతోషంగా ఉంది. 80% షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నాం. మా హీరో అశ్విన్ బాబు, బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, తమిళ నటుడు సాయి ధీనా, హైపర్ ఆది, మా నిర్మాత మహేశ్వర రెడ్డి చాలా సహకరించారు. సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అన్నారు.

Exit mobile version