Site icon NTV Telugu

Hyderabad: హీరో ఆలేటి వరుణ్‌ను సత్కరించిన మాజీ గవర్నర్

Aleti Varun

Aleti Varun

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ లలితా కళాతోరణంలో ఆదివారం ఉగాది విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సినీ హీరో ఆలేటి వరుణ్‌కు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అవార్డును అందించారు. తొలుత హీరో ఆలేటి వరుణ్‌ను శాలువాతో సత్కరించిన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అనంతరం అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు, రాజకీయ నేత బాబూ మోహన్ కూడా పాల్గొన్నారు. హీరోఆలేటి వరుణ్ గతంలో డిగ్రీ కాలేజ్ అనే సినిమాలో నటించాడు.

మరోవైపు తూ.గో. జిల్లా ఆలమూరు మండలం శివుడి లంక గ్రామానికి చెందిన ఎన్నారై రాయుడు వెంకటేశ్వరావుకు కూడా ఉగాది విశిష్ట సేవా పురస్కారం లభించింది. రాయుడు వెంకటేశ్వరరావు తూ.గో. జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు.

Exit mobile version