Site icon NTV Telugu

RRR : ఐకానిక్ సిటీలో హల్ చల్… అసలు ప్లాన్ రివీల్

RRR

RRR మూవీ టీం ఐకానిక్ సిటీలో ల్యాండ్ అయ్యారు. మరోవైపు మేకర్స్ అసలు ప్లాన్ రివీల్ చేశారు. మార్చి 25న సినిమా విడుదల కానున్న మాగ్నమ్ ఓపస్ మూవీ RRR ప్రమోషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం RRR బృందం చివరి దశ ప్రమోషన్‌లను ప్రారంభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం దుబాయ్‌లో ల్యాండైన చిత్రబృందానికి సంబంధించిన పిక్స్ విల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి కన్పించగా, ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఉన్నారు. మరోవైపు మేకర్స్ RRR ప్రమోషనల్ ప్లాన్ కు సంబంధించిన మ్యాప్ ను విడుదల చేసింది.

Read Also : Vijay Devarakonda : హీరోయిన్ తో పార్టీ… వీడియో లీక్

అందులో RRR టీం ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనే విషయాలను తేదీలతో సహా ప్రకటించారు. ఆ మ్యాప్ ప్రకారం ముందుగా అంటే మార్చ్ 20న బరోడాలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఇంటర్వ్యూలో పాల్గొననున్నారు. అదే రోజున ఢిల్లీలో సాయంత్రం 5 గంటలకు పీవీఆర్ ప్లాజాలో ప్రెస్ మీట్, సాయంత్రం 7 గంటలకు ఇంపీరియల్ లాన్ లో ఫ్యాన్ ఇంటరాక్షన్ ఈవెంట్ జరగనుంది.

మార్చ్ 21న అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో ఉదయం 11 గంటలకు ఓ ఈవెంట్, 11 : 30 నిమిషాలకు అక్కడే మీడియాతో టిక్ టాక్ ను నిర్వహించనున్నారు. అదే ఈరోజున జైపూర్ లో సాయంత్రం 3 గంటలకు, 5 : 10 గంటలకు మరో రెండు ఈవెంట్లు ఉన్నాయి. మార్చ్ 22న కోల్కత్తాలోని ఉనూర్ మజీద్ లో ఉదయం 10 : 30 గంటలకు, ఐకానిక్ ప్లేస్ హౌరా బ్రిడ్జ్ ల్లో 11 గంటలకు రెండు ఈవెంట్లు, అదే రోజున వారణాసిలో సాయంత్రం 5 : 20 గంటలకు ఇంటర్వ్యూ, 6 గంటలకు గంగా ఆరతి పూజలో పాల్గొననున్నారు టీం. మొత్తానికి జక్కన్న టీంతో సహా దేశవ్యాప్తంగా సరికొత్త ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నాడు.

Exit mobile version