NTV Telugu Site icon

Sankranthi Movies: సంక్రాంతి సినిమాల్లో ఏ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?

Sankranthi Movies

Sankranthi Movies

సంక్రాంతి సీజన్ వస్తుంది అంటే చాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్స్ విషయంలో రచ్చ జరుగుతూ ఉంటుంది. ఎప్పటిలాగే 2024 సంక్రాంతికి కూడా సినిమాల హీట్ పెరుగుతూ ఉంది. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్, ఏ మూవీ వెనక్కి వెళ్తుంది? ఇలా అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పండగ సెలవలు ఉంటాయి కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి కాబట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలి అనుకుంటారు. అయితే ఈ థియేటర్స్ విషయం, రిలీజ్ డేట్స్ అడ్జస్ట్మెంట్ విషయం కాసేపు పక్కన పెడితే ఈ సంక్రాంతి వచ్చే సినిమాల థియేట్రికల్ బిజినెస్ లు ఎంత? ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవుతాయి అనేది చూద్దాం.

సంక్రాంతి సినిమాల్లో అందరి దృష్టి గుంటూరు కారం సినిమాపైనే ఉంది. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు గుంటూరు కారం బిజినెస్ పైన కూడా కనిపిస్తోంది. గుంటూరు కారం థియేటర్ రైట్స్ ని 150 కోట్లకి అమ్మినట్లు సమాచారం. వెంకీ మామ నుంచి వస్తున్న సైంధవ్ సినిమా 34 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ మూవీ 25 కోట్లు, కింగ్ నాగార్జున నా సామిరంగ 24 కోట్లు, తేజ సజ్జా 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. దాదాపు ఇవే ఈ సంక్రాంతి సినిమాల ఫైనల్ థియేట్రికల్ బిజినెస్ ఫిగర్స్, ఈ మ్యాజిక్ ఫిగర్స్ ని క్రాస్ చేసిన సినిమాలు బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్లే. మరి ఏ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని ఎన్ని రోజుల్లో చేరుకుంటుంది అనేది చూడాలి.

Show comments