ఖైదీ సినిమాతో కోలీవుడ్-టాలీవుడ్ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయి, తన మేకింగ్ స్కిల్స్ తో తనకంటూ ఒక స్టాండర్డ్స్ ని సెట్ చేసుకున్నాడు. నెక్స్ట్ లియో సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్న లోకేష్ కనగరాజ్, చేసిన మూడు సినిమాలకే హ్యూజ్ ఫేమ్ ని సొంతం చేసుకున్నాడు. లియో కంప్లీట్ అవ్వగానే సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక సినిమా, ఖైదీ 2, విక్రమ్ 3, రోలెక్స్ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ లోకేష్ కనగరాజ్ లైనప్ లో ఉన్నాయి. దాదాపు పదేళ్లకి సరిపడా సినిమాలని లోకేష్ సెట్ చేసుకోని ఉన్నాడు. తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకోని మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న లోకేష్ కనగరాజ్, డైరెక్టర్ అవ్వడం కన్నా ముందు బ్యాంక్ లో జాబ్ చేసేవాడు.
Read Also: Sharwanand: కొత్త పెళ్లి కొడుకు అప్పుడే ‘బేబీ ఆన్ బోర్డ్’ అంటున్నాడు.. ఏంటి కథ?
షర్ట్ బటన్ పెట్టుకోవట్లేదని, క్లీన్ షేవ్ చేసుకోవట్లేదని లోకేష్ పైన మేనేజర్ కి ఎక్కువగా కంప్లైంట్స్ చేసేవారట. ఆ రెండూ చేయడం ఇష్టం లేని లోకేష్ కనగరాజ్… బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి, సినిమాల వైపు వచ్చేసాడు. అందరూ చెప్పినట్లు షర్ట్ బటన్ పెట్టి, క్లీన్ షేవ్ చేసుకోని, ఫార్మల్స్ వేసుకోని తిరిగి ఉంటే ఈరోజు మనకి లోకేష్ కనగరాజ్ లాంటి డైరెక్టర్ దొరికేవాడు కాదు. ఇలాంటి విషయాల గురించే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది… “ఎదగాలంటే మారాలి, లొంగాలి అంటే కుదరదు… మన దగ్గర విషయం ఉండాలి” అది ఉంటే చాలు ఎక్కడికి వెళ్లినా ఏలేయ్యొచ్చు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ చేస్తున్నది ఇదే.
