NTV Telugu Site icon

Sankranthi Films: సంక్రాంతి సినిమాల బిజినెస్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలంటే?

Sankranthi Films

Sankranthi Films

Sankranthi Films Pre-Release Business: సంక్రాంతి సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు బయటకు వచ్చాయి. రవితేజ ఈగల్ సినిమా వాయిదా పడటంతో తెలుగు నుంచి నాలుగు సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధవ్ సహా నాగార్జున నా సామి రంగ సినిమాలు రోజుల వ్యవధితో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంక్రాంతి సినిమాల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎక్కువగా చేసిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ -మహేష్ బాబు కాంబినేషన్ లో మూడవ సినిమాగా వస్తున్న ఈ సినిమా మొత్తం 135 కోట్ల బిజినెస్ చేసింది.

Nawazuddin Siddiqui: టాలీవుడ్, బాలీవుడ్ కి తేడా ఇదే.. ‘సైంధవ్’ విలన్ నవాజుద్దీన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ!

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్, తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ తెలుగు వెర్షన్ రెండూ దాదాపుగా ఒకే రేంజ్ లో బిజినెస్ జరుపుకున్నాయి. ఈ రెండు సినిమాలు 25 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు ప్రపంచవ్యాప్తంగా బ్రేక్-ఈవెన్ మార్క్ అందుకున్నట్టే. ఇక తెలుగు వెర్షన్ బిజినెస్ తక్కువ జరిగినా హనుమాన్ మిగతా బాషల మీద నమ్మకం పెట్టుకుంది. ఇక వెంకటేష్ సినిమాకి కూడా బిజినెస్ తక్కువే అయింది. నా సామి రంగ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ మార్క్ 18 కోట్లు. గుంటూరు కారం సినిమాతో పోలిస్తే మిగతా అన్ని సినిమాలు తమ బడ్జెట్‌లకు సరిపడా మంచి బిజినెస్ చేశాయి. ఇప్పటిదాకా ప్రతి సినిమా సేఫ్ పొజిషన్‌లో ఉంది. అన్ని సినిమాల నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. నిర్మాతలందరూ కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నారు. కొనుగోలుదారులకు సౌకర్యంగా ఉండేలా సినిమాలు బ్రేక్‌ఈవెన్‌ను సాధించాలని, సంక్రాంతి సీజన్ కావడంతో అధిక రాబడిని కూడా ఆశిస్తున్నారు నిర్మాతలందరూ.