NTV Telugu Site icon

Faahad: పుష్ప విలన్ తో సలార్ ప్రొడ్యూసర్ సినిమా… ట్రైలర్ అదిరింది

Faahad

Faahad

మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకోని స్టార్ స్టేటస్ అందుకున్న హీరో ‘ఫాహద్ ఫజిల్’. మలయాళ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఫాహద్, తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘పుష్ప’ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ సర్ గా ఫాహద్ ఫజిల్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టఫ్ పోలీస్ ఆఫీసర్ గా, ఇగోయిస్టిక్ పర్సన్ గా ఫాహద్, పుష్పకి చాలా మంచి ఎడిషన్ అనే చెప్పాలి. అలా తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు చేస్తున్న ఫాహద్ పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాడు. ఇప్పటికే విక్రమ్ సినిమాతో కమల్, సేతుపతి లాంటి స్టార్ తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకొని పాన్ ఇండియా సినిమా చేసాడు. ఈసారి సోలోగా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయడానికి ఫాహద్ రెడీ అయ్యాడు. కన్నడ మెయిన్ లాంగ్వేజ్ గా, పవన్ కుమార్ డైరెక్షన్ లో ఫాహద్ చేస్తున్న సినిమా ‘ధూమం’. KGF, కాంతార, సలార్ లాంటి సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబలే ఫిల్మ్స్ ధూమం సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది. జూన్ 23న రిలీజ్ చేయనున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ‘ధూమం’ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.

డబ్బులు బాగా ఎక్కువ సంపాదించాలి, ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత సుఖంగా ఉండొచ్చు… అన్ని కష్టాలని చెరిపేయగల సత్తా ఉన్న డబ్బుని సంపాదించడానికి ఫాహద్ ఏం చేసాడు? అతని లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అనేదే ధూమం సినిమా కథ. థియేటర్స్ లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు నో-స్మోకింగ్ యాడ్ ని అందంగా చెప్పడం ఎలా అనే దగ్గర మొదలైన ధూమం ట్రైలర్… కథని చెప్పకుండా, ట్రైలర్ ని ఇంట్రెస్టింగ్ గా కట్ చేసిన విధానం బాగుంది. అపర్ణ బాలమురళి, రోషన్ లు ట్రైలర్ లో చాలా ఇంటెన్స్ యాక్టింగ్ చేస్తూ కనిపించారు. ఫాహద్ ఫాజిల్ మాత్రం ఎప్పటిలాగే తన కళ్లతోనే ఇంటెన్సిటీని ప్రెజెంట్ చేస్తూ ట్రైలర్ లో ఇంకో ఆర్టిస్ట్ ని కనపడకుండా చేసాడు. హోంబలే ఫిలిమ్స్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది సూపర్ హిట్ అనే నమ్మకం ఆడియన్స్ లో, ఫాహద్ ఏ క్యారెక్టర్ చేసినా అది అద్భుతంగా ఉంటుంది అనే నమ్మకం సినీ అభిమానుల్లో ఉంది కాబట్టి ధూమం సినిమా మంచి హిట్ అయ్యే అవకాశమే ఉంది.

Show comments