Site icon NTV Telugu

ఆ అమ్మాయి గురించి హాట్ గా చెప్పిన సుధీర్ బాబు..

sudheer babu

sudheer babu

‘శ్రీదేవి సోడా సెంటర్’ తో పరాజయాన్ని చవిచూసిన సుధీర్ బాబు.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు. టాలీవుడ్ లో డిఫెరెంట్ ప్రేమకథలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

https://ntvtelugu.com/rana-daggubati-lights-up-unstoppablewithnbk/

ఇక తాజాగా నేడు నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుంచి హాట్ స్మోకింగ్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో సుధీర్ బాబు, కృతిని వెనక నుంచి ముద్దు పెడుతూ కనిపించాడు. పోస్టర్ చూస్తుంటే ఇందులో రొమాన్స్ పాళ్లు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ ని షేర్ చేసిన సుధీర్ బాబు “ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఇక నుంచి ఇంకా ఎక్కువ చెప్పుకుందాం” నాటు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమాతో సుధీర్ బాబు హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Exit mobile version