Site icon NTV Telugu

Hema Arrested: బ్రేకింగ్: టాలీవుడ్‌ నటి హేమ అరెస్ట్‌!!!

Actress Hema Arrest In Bengaluru Rave Party Case

Actress Hema Arrest In Bengaluru Rave Party Case

Hema Arrested in Drugs Case: అనేక మలుపులు అనంతరం బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్టు అయింది. గత నెల 19వ తేదీన బెంగళూరు శివారులలో ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్న విషయం తెలిసిన పోలీసులు ఆ పార్టీ మీద రైడ్ చేశారు. ఆ సమయంలో అనేకమంది బడాబాబులు, సినీ రంగానికి చెందినవారు ఆ పార్టీలో పాల్గొన్నట్లు తేలింది. చాలా మందికి టెస్టులు చేయగా వారిలో కొంతమందికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. అలాంటి వారిలో నటి హేమ కూడా ఉంది. అయితే ముందు నుంచి ఈ వ్యవహారంలో పోలీసులను తప్పుదోవ పట్టించేలా హేమ చర్యలు ఉన్నాయి.

Mamitha: పాపం… మమితా బైజుకి చేదు అనుభవం.. పాపని ఏం చేద్దామనుకున్నార్రా? అసలు!

తాను బెంగళూరులో లేను హైదరాబాదులో ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేయడం మొదలు తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలి పెట్టేది లేదంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం వరకు ఆమె ప్రతి విషయంలో హాట్ టాపిక్ అయింది. ఇక ఎట్టకేలకు ఈరోజు హేమ కోసం హైదరాబాదుకి బెంగుళూరు సిసిబి పోలీసులు వచ్చారు. ఇప్పటికే రెండుసార్లు హేమకి విచారణ కోసం రమ్మని బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ మొదటిసారి వైరల్ ఫీవర్ అని రెండవసారి మరో కారణంతో ఆమె విచారణకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఆమె కోసం బెంగుళూరు సిసిబి పోలీసులు హైదరాబాద్ వచ్చారు. ఆమెను విచారించిన అనంతరం మన అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం మీద పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆమె బెంగళూరు సిసిబి పోలీసులు అదుపులోనే ఉంది.

Exit mobile version