Site icon NTV Telugu

ThalapathyVijay : జననాయగన్ సెన్సార్ సర్టిఫికెట్ పిటిషన్ పై నేడు మద్రాసు హైకోర్టులో విచారణ…

Jananayagan

Jananayagan

విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జననాయగన్ ’. హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడుగా తీసుకువస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌లో వరల్డ్ వైడ్ గా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిఉంది. అందుకుసంబందించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. కేవలం అడ్వాన్స్ సేల్స్ లోనే రూ. 20 కోట్ల మార్క్ కూడా అందుకుంది.

Also Read : TheRajaSaab : రాజాసాబ్ ఓవర్శీస్ రివ్యూ.. దర్శకుడిపై ఫ్యాన్స్ ఆగ్రహం

అయితే రిలీజ్ కు ఒక్కరోజు ముందు సెన్సార్ సర్టిఫికేట్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. సినిమాలో దాదాపు 32 కు పైగా అభ్యంతరాలు తెలిపింది సెన్సార్ టీమ్. అందుకు ఒప్పుకొని మేకర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా నేడు జననాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది మద్రాసు హైకోర్టు. ఈ రోజు ఉదయం10.30 విచారణ తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. మరోవైపు ఇప్పటికే భారీ మొత్తంలో టికెట్ల విక్రయం చేశారు సర్టిఫికేట్ రాకపోవడంతో సినిమా విడుదలకు బ్రేక్ పడడంతో టికెట్ డబ్బులు వాపసు చేసారు. విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో మార్కెట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయ పార్టీ స్థాపించి విజయ్ ప్రజల్లోకి వెళ్లడంతో కావాలనే జననాయగన్ సినిమాను అధికార పార్టీ టార్గెట్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. కావాలనే సెన్సార్ ప్రక్రియపై జాప్యం చేస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సంక్రాంతి సీజన్ దాటిపోతే తీవ్రంగా నష్టపోతామనే ఆందోళనలో ఉన్నారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు..నేడు జరగబోయే విచారణలో హైకోర్టు తీర్పుపై ఆశలు పెట్టుకున్నారు విజయ్ అభిమానులు.

Exit mobile version