రెజీనా ఆవిష్కరించిన ‘హెడ్స్ అండ్ టేల్స్’ ఫస్ట్‌లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను జీ 5 ఓటీటీ రిలీజ్ చేసింది. తాజాగా ‘హెడ్స్ అండ్ టేల్స్’ మూవీని వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందినీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’. దీనికి ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథను అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఎన్రెడ్డి దీనికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రెజీనా విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు.
‘హెడ్స్ అండ్ టేల్స్’లో అనీషా పాత్రలో శ్రీవిద్య మహర్షి, మంగ పాత్రలో దివ్య శ్రీపాద నటించారు. మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది. ‘గర్ల్ ఫార్ములా’ యూట్యూబ్ ఛానల్‌లో కంటెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న శ్రీవిద్య – దివ్య ద్వయం మరోసారి ఈ సినిమాతో ప్రజల ముందుకొస్తున్నారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
‘హెడ్స్ అండ్ టేల్స్’ గురించి మేకర్స్ మాట్లాడుతూ “ఇదొక అందమైన కథ. ముగ్గురు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్కరూ జీవితంలో ఒక్కో దశలో ఉంటారు. జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి. అప్పుడు విధిరాత ఎలా రాసి ఉంది? ప్రతి మహిళకు భాగస్వామి పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉంది? అనేది కథ” అని చెప్పారు. దర్శకుడు సాయికృష్ణ ఎన్రెడ్డి మాట్లాడుతూ “ఒక్క రాత్రిలో జరిగే కథతో ‘హెడ్స్ అండ్ టేల్స్’ తెరకెక్కించాం. జీవితంలో వివిధ దశల్లో ఉన్న మహిళలు సమస్యలను పరిష్కరించే విధానం వేరుగా ఉంటుంది. మహిళల కథతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి మహిళకు స్ఫూర్తినిస్తుంది. తమ కోసం, తమ హక్కుల కోసం నిలబడాలని చెబుతుంది. ఇందులో జీవిత తత్వమూ ఉంది. మనం ఆలోచించే దానికంటే విధితో మన జీవితాలు ఎక్కువ ముడిపడి ఉన్నాయని చెప్పే చిత్రమిది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడదగ్గ సినిమా ఇది” అని అన్నారు. ఈ నెల 22 నుండి జీ 5 ఓటీటీ లో ‘హెడ్స్ అండ్ టేల్స్’ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!