హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్‌ఫుల్ ఎంట్రీ!

 he Man Movie Telugu

 he Man Movie Telugu

హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లార్జర్-ద్యాన్-లైఫ్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ (He-Man and the Masters of the Universe) ఇప్పుడు సరికొత్త హంగులతో భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ గ్లోబల్ వైడ్‌గా భారీ హైప్ క్రియేట్ చేయగా, తాజాగా విడుదలైన ఈ చిత్ర అఫీషియల్ తెలుగు ట్రైలర్ టాలీవుడ్ ఆడియన్స్‌కు ఒక అదిరిపోయే క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చింది.
అయితే హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు తెలుగులో టాలీవుడ్ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే మ్యాజిక్ ‘హీ-మ్యాన్’ చిత్రానికి రిపీట్ కాబోతోంది. ఈ సినిమాలో విశ్వాన్ని రక్షించే అజేయమైన వీరుడు ‘హీ-మ్యాన్’ పాత్రకు టాలీవుడ్ యంగ్ అండ్ వర్సటైల్ హీరో, ‘కార్తికేయ 2’ ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddharth) తెలుగులో తన పవర్‌ఫుల్ వాయిస్ అందించారు. నిఖిల్ మార్క్ బేస్ అండ్ ఎనర్జీ ఈ హాలీవుడ్ క్యారెక్టర్‌కు పక్కాగా సెట్ అయ్యిందంటూ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కేవలం హీరో పాత్రకే కాకుండా, ఈ సినిమాలో ఉన్న ఇతర కీలక పాత్రలకు కూడా టాలీవుడ్ టాప్ పర్ఫార్మర్లను రంగంలోకి దించింది సోనీ పిక్చర్స్. హాలీవుడ్ వర్షన్‌లో జారెడ్ లెటో పోషించిన ఈ మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ క్రూరమైన విలన్ పాత్రకు తెలుగులో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ (Aditya Menon) తన గంభీరమైన వాయిస్‌ను అందించారు.
అలాగే కథలో అత్యంత కీలకమైన మ్యాన్-అట్-ఆర్మ్స్ ‘డంకన్’ (ఇడ్రిస్ ఎల్బా పాత్ర) కు టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ (Rao Ramesh) డబ్బింగ్ చెప్పడం ఈ తెలుగు వర్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పవర్‌ఫుల్ తెలుగు వాయిస్ కాస్ట్ కారణంగా ‘ఎటెర్నియా’ (Eternia) అనే సరికొత్త ఊహాజనిత ప్రపంచంలో జరిగే యాక్షన్, ఎమోషన్, మైండ్ బ్లోయింగ్ ఫాంటసీ అంశాలు తెలుగు ప్రేక్షకులకు నేరుగా కనెక్ట్ కానున్నాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.  కాగా వచ్చే నెల (జూన్) 5వ తేదీన ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్,మలయాళ భాషల్లో ఈ చిత్రం భారతదేశమంతటా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.