Site icon NTV Telugu

HBD Rajinikanth: ‘రజనీ’ రొమాన్స్ సూపర్ హిట్.. తన కంటే 37 ఏళ్ల చిన్న హీరోయిన్‌తో..!

Hbd Rajinikanth

Hbd Rajinikanth

‘సూపర్ స్టార్’ రజనీకాంత్ ఈరోజు (డిసెంబర్ 12) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నేటితో ఆయనకు 75 ఏళ్లు నిండాయి. చిత్ర పరిశ్రమలో రజనీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. యాక్షన్-ప్యాక్డ్ మాస్ చిత్రాలకు దేశవ్యాప్తంగా కేరాఫ్ అడ్రస్‌గా రజనీకాంత్ ప్రసిద్ధి చెందారు. ఈ వయస్సులో కూడా యాక్షన్ మూవీస్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే వెండితెరపై చాలా మంది హీరోయిన్లతో రజనీ నటించారు. కొందరు ఆయన కంటే వయసులో చాలా చిన్నవారు కూడా ఉన్నారు. రజనీకాంత్ 20 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల హీరోయిన్‌లతో జతకట్టిన ఏడు సినిమాల గురించి ఓసారి తెలుసుకుందాం.

రాధికా ఆప్టే:
రజనీకాంత్ నటించిన కబాలి సినిమా 2016లో విడుదలైంది. ఇందులో సూపర్ స్టార్ సరసన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నటించారు. ఇద్దరి మధ్య 35 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. అయినా కూడా రజనీ-రాధికా జోడి హిట్ పెయిర్‌గా నిలిచింది.

సోనాక్షి సిన్హా:
రజనీకాంత్ నటించిన ‘లింగా’ చిత్రం 2014లో విడుదలైంది. ఈ సినిమాలో ఆయన సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టిలతో కలిసి నటించారు. రజనీకాంత్ కంటే సోనాక్షి 37 సంవత్సరాలు చిన్నవారు. సూపర్ స్టార్ కంటే అనుష్క 31 సంవత్సరాలు చిన్నది. ఈ ఇద్దరు కూడా రజినీకి మంచి జోడీ అనిపించారు.

ఐశ్వర్య రాయ్:
మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా రజనీకాంత్‌తో తెరపై ప్రేమాయణం సాగించారు. 2010లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం రోబోలో కలిసి నటించారు. ఐశ్వర్య, రజనీకాంత్ మధ్య 23 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఐశ్వర్య, రజనీ జోడీకి అప్పట్లో యమా క్రేజ్ నెలకొంది.

మనీషా కొయిరాలా:
రజనీకాంత్ 2002లో మనీషా కొయిరాలాతో కలిసి పనిచేశారు. ఇద్దరు ‘బాబా’ చిత్రంలో కలిసి నటించారు. మనీషా కొయిరాలా కంటే కూడా రజనీ 20 సంవత్సరాలు పెద్దవారు.

Also Read: Team India Chasing: 7 మ్యాచ్‌ల్లో 7 ఓటములు.. ఆ టార్గెట్ అంటే భారత్ బెంబేలెత్తిపోతోంది!

శ్రియ శరణ్:
2007లో వచ్చిన శివాజీ చిత్రంలో రజనీకాంత్, శ్రియ శరణ్ జంటగా నటించారు. ప్రేక్షకులు వారి కెమిస్ట్రీకి ఫిదా అయ్యారు. రజనీ, శ్రియ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇద్దరి మధ్య 32 సంవత్సరాల వయస్సు తేడా ఉంది.

రంభ:
సీనియర్ హీరోయిన్ రంభ కూడా రజనీకాంత్‌తో వర్క్ చేశారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో కూడా రంభ తన ముద్ర వేశారు. రజనీ కంటే రంభ 26 సంవత్సరాలు చిన్నవారు. ఇద్దరు కలిసి అరుణాచలం సినిమాలో నటించారు.

రమ్యకృష్ణ:
ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించారు. 1999లో రజనీకాంత్‌తో కలిసి నరసింహ సినిమాలో నటించారు. వారి కెమిస్ట్రీ వెండి తెరపై విజయవంతమైంది. రజనీ కంటే రమ్య 26 సంవత్సరాలు చిన్నవారు. నరసింహ సినిమాతోనే రమ్యకృష్ణలో మరో యాంగిల్ బయటికొచ్చింది. అప్పటివరకు గ్లామర్ పాత్రలు చేసిన ఆమె.. నెగటివ్ రోల్‌లో అదరగొట్టారు.

Exit mobile version