Have Disha Patani and Tiger Shroff broken up?
సినిమా తారల ప్రేమలు ఎక్కువగా కంచికి చేరని కథల్లాంటివే. ఏవో కొన్ని మాత్రమే ఏడడుగుల వరకూ వెళుతుంటాయి. పెళ్ళైన తర్వాత కూడా పెటాకులైన కథలు ఎన్నో. తాజాగా బాలీవుడ్ ప్రేమ జంట దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ ప్రేమకథకు కూడా మధ్యలోనే పుల్ స్టాప్ పడనున్నట్లు వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ చెట్టపట్టాలేసుకు తిరిగిన ఈ ప్రేమపక్షుల మధ్య ప్రస్తుతం ఎలాంటి బంధం లేదట. ఇప్పుడు వీరిద్దరూ ఒంటరిగా ఉంటున్నారనే రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం తెలియటం లేదు. వీరిద్దరూ ఒకరికొకరుగా గత 6 సంవత్సరాలుగా హల్ చల్ చేస్తూ వస్తున్నారు. తమ ప్రేమ గురించి ఎప్పుడూ ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. అందుకే బ్రేకప్ విషయంలోనూ నిశ్శబ్దంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.
ఇక వీరి ఎడబాటు వల్ల ఎవరికీ అంతగా నష్టం లేదు. దిశా పటానీ తను నటించిన ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సినిమా ప్రచారంలో బిజీగా ఉంది. టైగర్ తన కొత్త సినిమా ‘స్క్రూ ధీలా’ ను ప్రకటించాడు. దిశా, టైగర్ విడిపోయినప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాలో ఒకరినొకరు ఫాలో అవుతూ విషెస్ చెప్పుకుంటూ ఉన్నారు. సోమవారం టైగర్ ష్రాఫ్ కొత్త సినిమా ప్రకటించగానే తనను ఉత్సాహపరుస్తూ ‘కాంట్ వెయిట్ టైగర్’ అని వ్యాఖ్యానించటం విశేషం. ఏది ఏమైనా ఆరేళ్ళుగా కలసితిరిగిన జంట ఇలా విడిపోవడం వారి అభిమానులకు బాధను కలిగించే విషయమే.
