Site icon NTV Telugu

Coolie : లోకేష్ కనకరాజ్ సక్సెస్ జర్నీకి ‘కూలీ’ బ్రేక్ వేసినట్టేనా?

Lokesh Kanakaraj

Lokesh Kanakaraj

సినిమా పరిశ్రమలోఒక్క ప్లాప్ కూడా లేకుండా సినిమా చేయడం అనేది సవాల్ తో కూడుకున్న పని. కానీ ఓ దర్శకుడు మాత్రం డైరెక్షన్ స్టార్ట్ చేసిన నాలుగేళ్లలో  7 సినిమాలు చేసినా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా దూసుకెళ్తున్నాడు. పరాజయం అనే పదాన్నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా జైత్రయాత్ర సాగిస్తున్నాడు. అతడెవరో కాదు  ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లోకేష్ కనగరాజ్.

Also Read : Preity : టాలీవుడ్ కు దూరంగా.. కోలీవుడ్.. మాలివుడ్ లో యంగ్ బ్యూటీ బిజీ

మా నగరంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ ఖైది సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఒక రాత్రిలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాతో లోకేష్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక ఆ తర్వాత విజయ్ తో మాస్టర్, లియో సినిమాలతో అగ్ర దర్శకుల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కు చేరుకున్నాడు లోకేష్. ప్రస్తుతం సూపర్ స్టార్  RAJINIKANTH కూలీ సినిమాను తెరకెక్కించాడు లోకి. ఈ మల్టీ స్టారర్ మూవీ కి అయిన బడ్జెట్ సుమారు ₹300 కోట్లు. భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. లోకేష్ కెరీర్‌లో రిస్క్ మోస్ట్ ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ అలాగ తమిళనాట ఉదయం ఆట నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. కథ, కథనం వీక్ గా ఉందని టాక్ వినిపిస్తోంది.  ఇప్పటి వరకు ఫ్లాప్లే లేని ఈ డైరెక్టర్ కు కూలీ బ్రేక్ వేసిందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రీ బజ్ కారణంగా బుకింగ్స్ లో మాత్రం ఎక్కడ తగ్గకుండా దూసుకెళ్తోంది కూలి. వచ్చే సోమవారం వర్కింగ్ డే స్టార్ట్ అయితే కానీ కూలీ రిజల్ట్ క్లారిటీ రాదు. కానీ కూలీ లోకి వీకేస్ట్ రైటింగ్ అని చెప్పక తప్పదు.

Exit mobile version