NTV Telugu Site icon

Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి హీరోగా ‘మెగా’.. అదరగొట్టేశాడు అంతే..

Harsha

Harsha

Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నవారికి డబ్బును వెదజల్లుతూ కనిపిస్తాడు. ఇంకోపక్క యూట్యూబ్ లో రిచ్ లైఫ్ గడుపుతూ కనిపిస్తాడు. అసలు నిజంగా హర్షసాయికి అంత డబ్బు వస్తుందా..? అతను చేసే మంచి పనులు నిజమేనా..? అని అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. ఇక అప్పటి విషయం పక్కన పెడితే.. తాజాగా హర్షసాయి హీరోగా అవతారమెత్తాడు. మెగా లో డాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది కూడా హర్షసాయినే. ఇక ఈ చిత్రాన్ని బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ” ఏంటి డాక్టర్‌? ఏమీ అర్థం కావడం లేదు అని ఓ వ్యక్తి అడగ్గా.. ప్రపంచానికి తెలియని, ప్రపంచంలోని అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇదీ ఒకటి” అంటూ డాక్టర్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. ఒక గంట కింద హీరో హర్షసాయిని తాళ్లతో కట్టేసి పైకి లాగి చంపాడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. బాలయ్య సినిమా క్యాన్సిల్..?

ఇక ఆ సమయంలోనే హర్షసాయి కళ్ళు తెరిచి.. ” జీవితంలో ఓటమిని ఒప్పుకున్న క్షణమే .. నిజమైన ఓటమి.. రేయ్ ఒకటి చెప్పు .. నేను ఓటమిని ఒప్పుకొనేవాడిలా కనిపిస్తున్నానా.. ? చావు గురుంచి మాట్లాడుతున్నావ్ గా.. అసలు చావు అంటే ఏమిటి..? ” అని అనగానే పై నుంచి ఒక దెయ్యంను చూపించారు. అంటే ఇదేదో హర్రర్ కథగా కనిపిస్తుంది. ఇక ఇంకోపక్క డాక్టర్ .. ఒక జంతువు బలం అది కొరికినప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని బట్టి నిర్దారణ అవుతుంది.. అంటూ డైనోసర్ తో హీరోను పోలుస్తాడు.. అసలు హీరో ఎవరు..? ఈ కథ ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీజర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో హర్షసాయి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments