Haromhara: మాస్ సంభవం మొదలుపెట్టిన సుధీర్ బాబు.. టీజర్ అదిరిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haromhara: యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం హరోంహర. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నాడు. సుధీర్ సరసన మాళవిక శర్మ నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ను పాన్ ఇండియా స్టార్ల చేత రిలీజ్ చేయించారు. కన్నడ లో సుదీప్, మలయాళంలో మమ్ముట్టి, తమిళ్ లో విజయ్ సేతుపతి రిలీజ్ చేయగా.. తెలుగులో డార్లింగ్ ప్రభాస్.. టీజర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. మరోసారి సుధీర్ బాబు మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ ను బట్టి తెలుస్తోంది.
Ranbir Kapoor : లైవ్ లో కంటెస్టెంట్ కాళ్లు మొక్కిన స్టార్ హీరో.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
Also Read
- Shwetha Menon: మలయాళ 'అమ్మ'లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
- Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
- Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
- OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. స్టార్ట్ అయిన ‘OG 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్!
” అందరూ .. పవర్ కోసం గన్ పట్టుకుంటారు.. కానీ, ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది” అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. సైలెంట్ గా ఉండే హీరో జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన హీరో లీడర్ గా ఎలా మారాడు.. అనేది కథగా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు.ఏంటి . ? సుబ్రహ్మణ్యం పవర్ ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మాస్ లీడర్ గా సుధీర్ బాబు లుక్ ఆకట్టుకుంటుంది. చివర్లో ” వాడు సమరమే మొదలుపెడితే.. ఆ సంభవానికి సంతకం నాది అవుతాది” అని సుధీర్ డైలాగ్ హైలైట్ గా నిలిచింది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుధీర్ బాబు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!