NTV Telugu Site icon

Harold Das: రూత్ లెస్ విలన్ గా అర్జున్.. రోలెక్స్ కనిపించాడు బ్రో

Arjun

Arjun

Harold Das: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్స్ బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నా రెడీనా సాంగ్ ఎన్ని వివాదాలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్ మొత్తం లో విజయ్ సిగరెట్ కాలుస్తూనే కనిపించాడు. ఇలా సిగరెట్స్ తాగుతూ యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు.. వెంటనే ఈ సాంగ్ ను సినిమా నుంచి తొలగించాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేసాయి. అయితే ఈ వివాదాలపై లోకేష్ ఎప్పుడు స్పందించింది లేదు.

Indian 2: సేనాపతి వచ్చేశాడు.. ఇండియన్ 2 నుంచి కమల్ లుక్ రిలీజ్

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. నేడు హీరో అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆయన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇందులో అర్జున్.. హరాల్డ్ దాస్ గా కనిపించనున్నాడు. నిన్నటి నుంచి ఈ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ సిట్ చేశారు అభిమానులు. కొద్దిసేపటి క్రితమే హరాల్డ్ దాస్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అర్జున్ రూత్ లెస్ విలన్ గా కనిపించాడు. ఒక డెన్ లో నిదానంగా నడుచుకుంటూ వెళ్లి.. అక్కడ ఉన్న విలన్ చేతిని నరికేసి.. నవ్వడం చూస్తుంటే.. ఈ సినిమాలో అర్జున్ పాత్ర ఎంత భయంకరంగా ఉండబోతుందో అర్ధమవుతుంది. ఇక ఈ సీన్ చూసినప్పుడు.. విక్రమ్ చివర్లో రోలెక్స్ సీన్ గుర్తొచ్చింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.

Show comments