NTV Telugu Site icon

Harish Shankar: పవన్ డైరెక్టర్ కు సెటైర్ వేస్తే.. రిటైర్ అవ్వడమే.. ఇచ్చి పడేస్తాడు

Pawan

Pawan

Harish Shankar: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను అందించి.. స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒకడిగా చేరిపోయాడు. గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పవన్ రాజకీయ ప్రచారాల వలన.. ఉస్తాద్.. షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఈ మధ్యనే ఉస్తాద్ .. కొత్త షెడ్యూల్ మొదలుపెట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. హరీష్ శంకర్ నిత్యం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటాడు. తన మీద కానీ, సినిమా మీద కానీ ఏవైనా ట్రోల్స్ వస్తే .. నిర్మొహమాటంగా వారికి గట్టి కౌంటర్లు ఇస్తాడు. తాజాగా ఒక నెటిజన్ కు అలాగే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Sai Pallavi: ‘చై’తో మరోసారి సాయి పల్లవి.. లేడీ లక్కు ఏం చేస్తుందో?

“ఉస్తాద్ భగత్ సింగ్’ 50శాతం పూర్తయ్యిందంట కదా సర్, ఇక క్వాలిటీ ఆ దేవుడి మీదే భారం వేశాం” అంటూ ఒక నెటిజన్ హరీష్ పై సెటైర్ వేశాడు. అంటే క్వాలిటీ లేకుండా త్వరత్వరగా సినిమాను పూర్తిచేస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై హరీష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. “అంతే కదా తమ్ముడు అంతకు మించి నువ్వేమి చేయగలవు చెప్పు..? ఈ లోగా కాస్త కెరీర్, జాబ్, స్టడీస్ మీద ఫోకస్ పెట్టు, వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు, ఆల్ ది బెస్ట్” అంటూ కూల్ గానే గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇంకోపక్క హరీష్ ఒరిజినల్ అకౌంట్ కాకుండా.. మరో అకౌంట్ తో అభిమానులను తిడుతున్నాడని రాసుకురాగా .. దానికి కూడా హరీష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.. తాను ఏది మాట్లాడాలన్న అది తానుగానే మాట్లాడతాను అని, తనకు ఉన్నది ఒక అకౌంట్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ట్వీట్స్ చూసిన అభిమానులు పవన్ డైరెక్టర్ కు సెటైర్ వేస్తే.. రిటైర్ అవ్వడమే.. ఇచ్చి పడేస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://x.com/harish2you/status/1704372366846160966?s=20

Show comments