NTV Telugu Site icon

Harish Shankar: నేను హామీ ఇస్తున్నా.. 2018 మీకు బాగా నచ్చుతుంది

Harish Shankar

Harish Shankar

Harish Shankar: ప్రస్తుతం ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న కూడా చూడటం అలవాటు అయిపోయింది. రీసెంట్ టైమ్స్ లో క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళం సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ లిస్ట్ లోకి చేరిపోయింది 2018. కున్చాకో బోబన్,వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి ప్రముఖ నటీనటులు నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అక్కడ హిట్ అందుకున్న ఈ సినిమాను తెలుగులో నిర్మాత బన్నీ వాస్ రిలీజ్ చేస్తున్నారు. కేరళలో 2018 లో అధిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో సుమారుగా 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కేరళ చరిత్రలో సుమారు ఓ శతాబ్దంలో ఇవే అతి పెద్ద వరదలు అని చెప్పొచ్చు. దీనిని బేస్ చేసుకుని “జూడ్ ఆంథనీ జోసెఫ్” ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మే 26 న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. తాజాగా ప్రెస్ మీట్ ను నిర్వహించగా .. డైరెక్టర్ హరీష్ శంకర్.. బన్నీ వాస్ కు సపోర్ట్ చేయడానికి గెస్ట్ గా వచ్చాడు. చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్, సినిమాటోగ్రాఫర్ అఖిల్ జార్జ్, ఎడిటర్ చమన్ చక్కో సైతం హాజరయ్యారు.

SSMB28: ఏం త్రివిక్రమ్ బ్రో.. ఆ వార్త నిజమేనా..?

ఇక ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టరో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ” ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయినా సంచలనాలకు ఏ మాత్రం తగ్గడం లేదు. మలయాళంలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత “బన్నీ వాసు” రిలీజ్ చేయనున్నారు. 150 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో మే 26న భారీ స్థాయిలో విడుదల కానుంది. అలానే ఈ సినిమాకి సంబంధించి, మీడియా వారికి వేసిన ప్రీమియర్ షో నుంచి అద్భుతమైన స్పందన రావడం విశేషం.. తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా 2018 నచ్చుతుంది, నాది హామీ” అని చెప్పుకొచ్చాడు.

Show comments