ఫుల్లీ అండ్ మళ్ళీ లోడెడ్… తేజ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని వారాల క్రితం బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ వంతెన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తేజ్ కు అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ వంటి పలు ఆపరేషన్లు జరిగాయి. సుప్రీం హీరో ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న తేజ్ త్వరలోనే సినిమా షూటింగులతో కూడా పాల్గొంటాడని ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించారు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ తేజ్ ను పరామర్శించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా తేజ్ హెల్త్ పై అప్డేట్ ఇచ్చారు.
Read Also : భారీ ధరకు “శ్యామ్ సింగ రాయ్” మ్యూజిక్ రైట్స్
Also Read
బుధవారం రాత్రి హరీష్ శంకర్ ట్విట్టర్లో తాను సాయి ధరమ్ తేజ్‌ని కలిశానని, అద్భుతంగా మాట్లాడాడని ట్వీట్ చేశారు. “నా బ్రదర్ తేజ్ సూపర్ ఫిట్‌గా ఉన్నాడు. జయించేందుకు సిద్ధమవుతున్నాడు. ఫుల్లీ అండ్ మళ్ళీ లోడెడ్” అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో “తేజ్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా చాలా మందికి ఆహారాన్ని అందిస్తున్నాడు. ఆయన యాక్సిడెంట్ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తూ చాలా మంది భోజనం చేస్తున్నారు” అంటూ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!