పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో ‘హరిహర వీరమల్లు’ సినిమా రూపొందుతోంది. మొగల్ చక్రవర్తుల కాలానికి చెందిన ఒక వజ్రాల దొంగ కథ ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు. ఈ సినిమా 50 శాతం షూటింగు పూర్తి చేసుకున్న తరువాత, కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత ‘భీమ్లా నాయక్’ సినిమాను ముందుగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ ఆ పనిలోనే ఉన్నాడు. ఆయనకి సంబంధించిన పోర్షన్ చాలా వరకూ పూర్తయింది. అందువలన ఇక ‘వీరమల్లు’ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. దీపావళి పండుగ తరువాత పవన్ “హరిహర వీరమల్లు” షూటింగులో జాయిన్ కానున్నాడు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న సినిమా విడుదల కానుంది.
“హరిహర వీరమల్లు” షూటింగ్ రీస్టార్ట్ ఎప్పుడంటే ?

Hari Hara Veeramallu