Hari Krishna Jayanthi Special: తొలి నటవారసుడు – హరికృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నందమూరి హరికృష్ణ నిలిచారు. మహానటుడు నటరత్న యన్టీఆర్ తన తనయుల్లో మూడవవాడైన హరికృష్ణను బాలనటునిగా ‘శ్రీకృష్ణావతారం’లోనే పరిచయం చేశారు. అందులో బాలకృష్ణునిగా హరికృష్ణ ముద్దుగా మురిపించారు. ఆ తరువాత నిర్మాతగానూ సాగారు. తండ్రిలాగే రాజకీయాల్లోనూ రాణించారు హరికృష్ణ.
హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2న యన్టీఆర్ నాలుగో కుమారునిగా జన్మించారు. యన్టీఆర్ తనయుల్లో హరికృష్ణ భలే వేగం చూపించేవారు. దానిని పసికట్టి యన్టీఆర్ తన ‘శ్రీకృష్ణావతారం’లో బాలకృష్ణునిగా నటింప చేశారు. తరువాత యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘తల్లా?పెళ్ళామా?’లోనూ హరికృష్ణ కీలక పాత్ర పోషించారు. ఇందులోనూ శ్రీకృష్ణుని గెటప్ లో అలరించారు. హరికృష్ణ తమ్ముడు బాలకృష్ణ నటించిన తొలి సినిమా ‘తాతమ్మకల’లో యన్టీఆర్ కు తనయునిగా, బాలయ్యకు అన్నగా నటించారు. హరికృష్ణ తమ్ముడు బాలయ్యతో కలసి ‘రామ్-రహీమ్’లోనూ మురిపించారు. ఇక తన తండ్రి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘దానవీరశూర కర్ణ’లో అర్జునునిగా అభినయించారు. ఆ సినిమా తరువాత తండ్రి హీరోగా నటించిన ‘డ్రైవర్ రాముడు’తో నిర్మాతగా మారి, తమ రామకృష్ణ సినీస్టూడియోస్, తారకరామా ఫిలిమ్ యూనిట్ నిర్మించే చిత్రాల నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నారు. నైజామ్ ఏరియాలో యన్టీఆర్ పంపిణీ సంస్థ ‘రామకృష్ణ డిస్ట్రిబ్యూటర్స్’ను కూడా హరికృష్ణ నిర్వహించేవారు. తమ్ముడు బాలకృష్ణ హీరో అయిన తరువాత “పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, తిరగబడ్డ తెలుగుబిడ్డ, పెద్దన్నయ్య” వంటి చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
Also Read
- Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
- Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
- Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
- Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
నటనకు దూరంగా ఉన్న హరికృష్ణతో ‘శ్రీరాములయ్య’లో ఓ కీ రోల్ పోషింప చేశారు దర్శకుడు ఎన్.శంకర్. అందులో హరికృష్ణపై చిత్రీకరించిన ‘నీకిస్త తమ్ముడా… నీకిస్త తమ్ముడా…’ పాట అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తరువాత వైవిఎస్ చౌదరి తన ‘సీతారామరాజు’లో హరికృష్ణను, ఏయన్నార్ నటవారసుడు నాగార్జునను కలిపి తెరకెక్కించారు. ఇద్దరు మహానటుల వారసుల చిత్రం కాబట్టి, ఈ సినిమా జనాన్ని అలరించింది. ఆ తరువాత వైవిఎస్ చౌదరి తమ సొంత బ్యానర్ బొమ్మరిల్లు పతాకంపై హరికృష్ణ హీరోగా ‘లాహిరి లాహిరి లాహిరిలో…’, ‘సీతయ్య’ మంచి విజయం చూశాయి. అనూహ్యంగా ఆ సమయంలో హరికృష్ణకు స్టార్ డమ్ లభించింది. “టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి” వంటి చిత్రాల్లోనూ హరికృష్ణ నటునిగా మురిపించారు. కృష్ణతో కలసి హరికృష్ణ నటించిన ‘శ్రావణమాసం’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత మళ్ళీ హరికృష్ణ కెమెరా ముందుకు రాలేదు.
యన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసిన తరుణంలో ఆయన చైతన్యరథానికి సారథిగా హరికృష్ణ తెలుగునేల నలుచెరుగులా పయనించారు. తండ్రి ఎప్పుడు చైతన్యరథం అధిరోహించినా, సారథి స్థానంలో హరికృష్ణ ప్రత్యక్షమయ్యేవారు. రాజకీయాల్లోనూ హరికృష్ణ తనదైన పాత్ర పోషించారు. తండ్రి యన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుండి 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందు చంద్రబాబు మంత్రివర్గంలో ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ గానూ పనిచేశారు. 2008లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
హరికృష్ణకు ముగ్గురు కుమారులు జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారకరామ్. వీరిలో కళ్యాణ్, తారక్ ఇద్దరూ నటనలో రాణిస్తున్నారు. వీరిద్దరితో కలసి హరికృష్ణ నటిస్తారని చాలా రోజులు వినిపించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తనయుల విజయం చూస్తూ, మనవడు మరో యన్టీఆర్ ను ‘దానవీరశూరకర్ణ’ బాలల చిత్రంలో చూసి
పొంగిపోయారు హరికృష్ణ. ఆయన పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తరువాత నాలుగేళ్ళకే 2018 ఆగస్టు 29న హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం విచారకరం. తెలుగు చిత్రసీమలో నటవారసుల ప్రస్తావన వచ్చిన ప్రతీసారి హరికృష్ణ పేరు తప్పక వినిపిస్తుంది.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్‌కు రోహిత్ పేరెంట్స్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్‌గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!