Site icon NTV Telugu

HHVM : హరిహరా.. ఆ సీన్లు డిలీట్..

Hhvm (4)

Hhvm (4)

HHVM : పవన్ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో ఆడుతోంది. అయితే నిన్న థియేటర్లలో మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. అందులో వీఎఫ్ ఎక్స్ మరీ దారుణంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్ బాగున్నా.. సెకండ్ హాప్ లో వీఎఫ్‌ ఎక్స్ కారణంగానే ప్రేక్షకులు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారనే విమర్శలు రావడంతో మూవీ టీమ్ రియాక్ట్ అయింది. వెంటనే వీఎఫ్‌ ఎక్స్ వీక్ గా ఉన్న సీన్లను ట్రిమ్ చేసేసింది. ఇప్పటికిప్పుడు వాటి ప్లేస్ లో వేరే సీన్లు పెట్టలేరు కాబట్టి వీఎఫ్‌ ఎక్స్ అంత బాగా లేని కొన్ని సీన్లను డిలీట్ చేసేశారు. సెకండ్ హాఫ్‌ లో హార్స్ రైడింగ్ సీన్, తోడేలు సీన్, కోహినూర్ వజ్రం దొంగిలించేందుకు వీరమల్లు వెళ్లే జర్నీ సీన్స్ లో కొన్నింటిని డిలీట్ చేశారు.

Read Also : Adult Content Apps : అశ్లీల చిత్రాలు.. ఉల్లూ సహా 25 యాప్స్ బ్యాన్..!

మొత్తంగా 20 నిముషాల సీన్లను డిలీట్ చేసేశారు. ఇంతకు ముందు 2 గంటల 42 నిముషాల ఉన్న నిడివి ఇప్పుడు 2 గంటల 22 నిముషాలకు వచ్చేసింది. ఈ సీన్ల కారణంగానే సెకండ్ హాఫ్ కు దెబ్బ పడుతుందని మూవీ టీమ్ గుర్తించింది. అందుకే వాటిని తీసేస్తూ మూవీ సీన్ల మధ్య లింక్ కట్ అవకుండా జాగ్రత్తలు తీసుకున్నారంట. ఈ కట్ చేసిన కొత్త వీరమల్లు మూవీ నిన్న రాత్రి నుంచే థియేటర్లలో ఆడుతోంది. దాంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుందని మూవీ టీమ్ చెబుతోంది. రిలీజ్ రోజు నుంచే మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రీమియర్స్ తో మూవీకి భారీగా వసూళ్లు వచ్చాయి. ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు కలెక్షన్ల పరంగా వీరమల్లు బాగానే రాబట్టింది. ఇప్పటి వరకు పవన్ కెరీర్ లో ఇంత భారీ ఓపెనింగ్స్ ఇప్పటి వరకు రాలేదు. పవన్ ఎన్నడూ చేయనన్ని ప్రమోషన్లు ఈ సినిమా కోసమే చేయడంతో అది ప్లస్ అయింది. అలాగే సక్సెస్ మీట్ కూడా నిర్వహించి మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది.

Read Also : WAR 2 Trailer : ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ.. ట్రైలర్ లో సమన్యాయం..

Exit mobile version