Site icon NTV Telugu

HHVM Trailer : ‘వీరమల్లు’ ట్రైలర్ సంచలన రికార్డు..

Hhvm

Hhvm

HHVM Trailer : పవన్ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ అవుతోంది. చాలా వాయిదాల తర్వాత వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వస్తోంది. రికార్డు వ్యూస్ తో దుమ్ము లేపింది ఈ ట్రైలర్. 24 గంటల్లో ఈ నడుమ వస్తున్న వ్యూస్ ను బట్టి రికార్డుల లెక్కలు తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరమల్లు అందరికంటే టాప్ లో నిలిచింది. 24 గంటల్లోనే ఏకంగా 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, తెలుగు సినిమాల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇది తెలుగు లాంగ్వేజ్ లో వచ్చిన వ్యూస్. ఇక అన్ని భాషల్లో కలిపి ఏకంగా 62 మిలియన్ల వ్యూస్ సాధించింది ఈ ట్రైలర్.

Read Also : Allu Aravind : అల్లు అరవింద్ కు ఈడీ ప్రశ్నల వర్షం..

ట్రైలర్ నుంచే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ప్రారంభిస్తుందని డైరెక్టర్ జ్యోతి కృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్టు గానే ట్రైలర్ తోనే అందరికంటే టాప్ లో నిలిచి దుమ్ము లేపింది ఈ ట్రైలర్. ఇక రిలీజ్ అయితే రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో అని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. ట్రైలర్ లో యాక్షన్ సీన్లు బాగా హైలెట్ అవుతున్నాయి. ఇందులో వాడిన వీఎఫ్ ఎక్స్ కూడా బాగానే ఉండటం కలిసొచ్చింది. పవన్ కల్యాణ్‌ చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి యాక్షన్ సీన్లలో నటించారు అంటూ కామెంట్లు వస్తున్నాయి. పవన్ కల్యాణ్‌ నుంచి నాలుగేళ్ల తర్వాత సినిమా వస్తున్నా సరే ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతి త్వరలోనే పవన్ కల్యాణ్‌ కూడా ఈ ప్రమోషన్లలో పాల్గొంటారనే ప్రచారం ఉంది. ఇక రిలీజ్ అయ్యాక ఏ స్థాయి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Read Also : Pawan Kalyan: నాకు ఇంటర్ సీట్ ఆయనే ఇప్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన పవన్!

Exit mobile version