Site icon NTV Telugu

HHVM : వీరమల్లుకు ఆ రెండు జిల్లాల్లో భారీ వసూళ్లు..?

Hhvm (2)

Hhvm (2)

HHVM : పవన్ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు మూవీ కొన్ని గంటల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ప్రీమియర్స్ కోసం ఏపీలో భారీగా షోలు వేస్తున్నారు. గతంలో ఏ సినిమాకు వేయనన్ని ప్రీమియర్స్ హరిహరకు దక్కాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో వీరమల్లుకు పడుతున్న ప్రీమియర్స్ షోలు, ఇక్కడి టికెట్ రేట్లు, ఇక్కడ జరిగిన బిజినెస్ లెక్కలు హైలెట్ అవుతున్నాయి. ఏపీలో హరిహర వీరమల్లు మూవీని రూ.60 కోట్లకు అమ్మేశారు. ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో రూ.9.50 కోట్లకు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7 కోట్లకు మూవీని అమ్మేశారు. అంటే ఈ రెండు జిల్లాల్లోనే 30 శాతం బిజినెస్ జరిగింది. ఇప్పుడు ప్రీమియర్స్ కూడా ఇక్కడే ఎక్కువగా వేస్తున్నారు.

Read Also : HHVM : పవన్ ఎన్నడూ చేయని యాక్షన్ సీన్లు.. వీరమల్లులో అవే హైలెట్..

ఈ రెండు జిల్లాల్లో 49 సెంటర్లకు గాను 47 సెంటర్లలో 107 ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అంటే దాదాపు అన్ని థియేటర్లలో వేస్తున్నారన్నమాట. ఇక్కడ ప్రీమియర్స్ లో ఒక్కో టికెట్ రేటు రూ.800 నుంచి మొదలవుతోంది. కొన్ని సెంటర్లలో అయితే ఏకంగా రూ.1500 వరకు బ్లాక్ లో అమ్మేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ థియేటర్లు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఇక్కడ జరిగిన బిజినెస్ రెండు రోజుల్లోనే వచ్చేలా ఉంది. అసలే గోదావరి జిల్లాల్లో పవన్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్లాప్ సినిమాలు కూడా ఇక్కడ భారీ వసూళ్లు సాధిస్తాయి. అలాంటి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చూస్తుంటే వారం వరకు గోదావరి జిల్లాల్లో వీరమల్లు హౌస్ ఫుల్ అయ్యేలా ఉంది. ఏపీ మొత్తం బిజినెస్ లో ఈ జిల్లాల నుంచే 40 శాతం వరకు వసూళ్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా ఇక్కడ కలెక్షన్ల వరద పారడం ఖాయం.

Read Also : HHVM : ప్రీమియర్స్ తోనే రికార్డుల వేట.. వీరమల్లు భారీ స్కెచ్..

Exit mobile version