HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ కు దగ్గర పడింది. జులై 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. అన్ని పనులను పూర్తి చేసుకుంది. తాజాగా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. U/A సర్టిఫికేట్ పొందింది ఈ మూవీ. మూవీ రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు. రిలీజ్ కు పది రోజులే ఉన్నా ఇంకా ప్రమోషన్లు చేయట్లేదనే అసంతృప్తి కొంత అభిమానుల్లో ఉంది. వాటన్నింటికీ చెక్ పెట్టేస్తూ జులై 20న భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మూవీ టీమ్. వైజాగ్ లో ఈవెంట్ ఉండబోతోంది. ఈవెంట్ కు సీఎం చంద్రబాబు కూడా వస్తారనే ప్రచారం జరుగుతోంది.
Read Also : K-Ramp : కె-ర్యాంప్ గ్లింప్స్ రిలీజ్.. నాటుగా దించేసిన కిరణ్ అబ్బవరం
దానిపై త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించి మూవీపై ఒకేసారి బజ్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారంట. భారీ పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హిందూ ధర్మకర్తగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఈ స్థాయిలో యాక్షన్ సీన్లు చేయలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో పవన్ లుక్ కూడా అదిరిపోయింది. క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న వీరమల్లు ప్రమోషన్లు కూడా పెంచబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Saroja Devi : సన్యాసిగా మారాలనుకుని.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సరోజా దేవి
