HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జులై 24న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుసగా మూవీ నుంచి అప్డేట్లు ఇస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజాగా అనౌన్స్ చేశారు. జులై 20న వైజాగ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే మూవీ నుంచి రెండు సర్ ప్రైజ్ లు త్వరలోనే ఉంటాయన్నారు. అందులో ఒకటి మేకింగ్ వీడియో అయితే ఇంకొకటి పవర్ ఫుల్ సాంగ్. ఈ రెండింటిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందే రిలీజ్ చేయబోతున్నారు.
Read Also : Prabhas : ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటామన్న స్టార్ హీరోయిన్లు..
తాజాగా దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రమోషన్లు స్టార్ట్ చేయట్లేదనే భావన అభిమానులు కొంత ఉంది. దాన్ని కవర్ చేసేందుకు ఇప్పుడు ఈ అప్డేట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో పవన్ కల్యాణ్ ధర్మకర్తగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు పవన్ ఇలాంటి పాత్రలో నటించలేదు. పైగా మూవీలో ఆయన యాక్షన్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. అసలే పవన్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో పాటు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి రికార్డులు, సంచలనాలపై ఫ్యాన్స్ ఆశలు పెంచుకుంటున్నారు. మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
Read Also : HHVM : వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడే..
